సినిమా వార్తలు

‘ధురంధర్’ ఎఫెక్ట్‌.. బాలీవుడ్‌లో మరో వికెట్ డౌన్?

ఒక సినిమా హిట్… ఇంకొక సినిమాపై ప్రభావం చూపిస్తుందా? బాలీవుడ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ధురంధర్ సక్సెస్‌తో ఇండస్ట్రీలో ఊహించని చర్చలు మొదలయ్యాయి. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ డిసెంబర్ 5న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రియలిస్టిక్ ట్రీట్మెంట్, స్ట్రాంగ్ కథనంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.925 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది.

ఈ సినిమాలో రెహమాన్ డెకాయిట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటనకు భారీ ప్రశంసలు వస్తున్నాయి. ఆయన పాత్రకు సంబంధించిన సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజ్‌తో అక్షయ్ ఖన్నా పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది.

ఇదే ధురంధర్ ఎఫెక్ట్‌గా ఇప్పుడు దృశ్యం 3 చుట్టూ చర్చలు సాగుతున్నాయి. ధురంధర్ హిట్ తర్వాత అక్షయ్ ఖన్నా తన పారితోషికాన్ని పెంచాడని, అది మేకర్స్‌కు భారంగా మారడంతో దృశ్యం 3 నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దృశ్యం 2 సమయంలోనే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మరో వర్గం మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. అక్షయ్ ఖన్నా ఇంకా ప్రాజెక్ట్‌లోనే ఉన్నాడని, హిందీ వెర్షన్ వచ్చే ఏడాది విడుదల కానుందని అంటున్నారు. మలయాళ వెర్షన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం.

ఏది ఏమైనా, ధురంధర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో బాలీవుడ్‌లో సమీకరణాలు మారుతున్నాయన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Similar Posts