స్టార్ హీరోయిన్స్ పర్శనల్ ఫొటోలుకు, వీడియోలకు ఉండే డిమాండ్ ని గమనించి సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఎల్నాజ్‌ నోరౌజీ సైబర్ క్రైమ్ కు బలి అయ్యింది. తన పాస్‌వర్డ్‌ను సబ్జెక్ట్‌గా కలిగి ఉన్న ఇమెయిల్‌ను అందుకున్న తర్వాత సైబర్‌క్రైమ్‌కు గురైనట్లు వెల్లడించింది.

ఆ మెయిల్ లో తన పర్శనల్ ఫొటోలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అలాగే వాటితో పాటు బ్లాక్‌మెయిల్ బెదిరింపు ఉంది. ఇన్విస్టిగేషన్ తర్వాత ఈ మెయిల్ డిటేల్స్ ని స్విస్ సర్వర్‌లో గుర్తించారు. కానీ పంపించిన వ్యక్తి వివరాలు ఇంకా దొరకలేదు.

ఈ క్రమంలో ఆమె తను తన కొత్త మెయిల్ ని ఓపెన్ చేసానని, అయినా సరే మళ్లీ ఇలాంటి మెయిల్ వస్తుందేమో అన్నట్లు అనిపిస్తోంది అందామె. అసలు తన పర్శనల్ ఫొటో, తన పాస్ వర్డ్ ఎలా అవతలి వ్యక్తికి చేరాయో అర్దం కావటం లేదు అంది. ఆమెమీడియాతో మాట్లాడుత… “ఎవరో నన్ను ఎప్పుడూ చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది, మరియు నేను నిరంతరం భయంతో జీవిస్తున్నాను.” అని చెప్పుకొచ్చింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లెక్స్ లో ప్రసారమయిన “స్కేర్డ్ గేమ్స్” ఎంతటి ప్రజాదారణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో నటించిన ఇరాన్ హీరోయిన్ “ఎల్నాజ్ నోరౌజీ” .

ఇరాన్‌కు చెందిన నటి నోరౌజీ.. నటన కంటే ముందు పదేళ్ల పాటు డియోర్‌, లాకాస్టే, లె కాక్యూ స్పోర్టివ్‌ లాంటి బ్రాండ్స్‌కు మోడల్‌గా పని చేశారు. పర్షియన్‌ ట్రెడిషనల్‌ డ్యాన్స్‌తో పాటు భారత్‌లో కథక్‌ను సైతం ఆమె నేర్చుకున్నారు.

You may also like
Latest Posts from