భారత సినీ రంగంలో కళాత్మక దృష్టి, భావనలలో లోతు, మానవ సంబంధాల్లో సున్నితత్వం — ఈ మూడింటిని కలిపి చెప్పాలంటే పేరు మణిరత్నం. అందుకే ఆయన ఓ డైరెక్టర్ కంటే ముందు ఓ భావన… ఓ సున్నితమైన వ్యక్తిత్వం. అలాంటి మనిషి జీవితంలోకి ఒక మహిళ ప్రేమగా, తోడుగా అడుగుపెట్టిన ఘట్టం ఇప్పుడోసారి మళ్లీ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అవుతోంది.
తాజాగా ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సుహాసిని మణిరత్నం, తన ప్రేమకథ వెనకున్న నిజాన్ని ఆసక్తికరంగా వివరించారు. ఆమె చెబుతున్నట్టుగా –
“నా జీవితం మొత్తం మార్చేసిన ఓ సినిమా… అదే నాయకన్. ఆ సినిమా చూసిన వెంటనే మణిరత్నం గారికి ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడాను. ఆయన ఎవరో తెలియకపోయినా, ఆ సినిమా చూసిన రోజే ఆయనతో ప్రేమలో పడిపోయాను.”
ఇక్కడే ఆసక్తికర ట్విస్ట్ ఉంది — సుహాసిని ఓ స్టార్ గా అప్పటికే పెద్ద పేరు. కానీ ఆ సినిమాకు, ఆ విజన్‌కి, ఆమె తన మనసును అర్పించింది. “నాయకన్ చేయకపోయి ఉంటే, నేను మణిరత్నం లైఫ్‌లో ఉండేను కాదు” అంటూ సుహాసిని సూటిగా చెప్పిన మాటలు ఇప్పుడు నెట్‌ను ఊపేస్తున్నాయి.
ఈ ప్రేమకథ సాఫీగా సాగుతూ 1988లో సుహాసిని – మణిరత్నం జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంతే కాదు, తర్వాత కాలంలో ఆమె ఆయన సినిమాలకు డైలాగ్ రైటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్‌ప్లే రచయితగా కూడా పని చేసి, కలలు కండే దర్శకుడికి కలల్ని మలిచే చేతులుగా మారారు.
సినిమా ప్రేమకథలు తలదన్నే నిజమైన ప్రేమకథ ఇది. ఒక దర్శకుని సృష్టి, ఇంకొకరిని ప్రేమలో పడేసిన ఉదాహరణ ఇది. నాయకన్… ఓ సినిమా మాత్రమే కాదు – ఒక జీవిత మార్గాన్ని మార్చిన మైలురాయి!
ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. కమలహాసన్, శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాసుంది.