మహాత్ముడి(Gandhi) జీవితంపై అనేక సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఆయన జీవితంపై ఓ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ హిందీ దర్శకుడు హన్సల్ మెహతా (Hansal Mehta) దీనికి దర్శకత్వం వహించనున్నారు. గాంధీ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ (Pratik Gandhi) నటించనున్నారు. భారత స్వాతంత్య్ర పోరాట కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపెట్టడానికి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ప్రముఖ రచయిత రామచంద్ర గుహ రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ది ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ది వరల్డ్’ రచనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. ‘‘గాంధీ లాంటి గొప్ప వ్యక్తి జీవితం గురించి చెప్పాలంటే చాలా బాధ్యత ఉంటుంది. మహాత్ముడికి గొప్ప నివాళిలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దుతాం’’అని చెప్పారు హన్సల్ మెహతా. స్టాక్ మార్కెట్ స్కామ్ నేపథ్యంలో ప్రతీక్ గాంధీ నటించిన ‘స్కామ్ 1992’ సిరీస్‌కి హన్సల్ మెహతాయే దర్శకత్వం వహించారు.
దక్షిణాఫ్రికాలో వలస పాలకుల అనుచరులు 1896లో గాంధీని విమర్శిస్తూ “ఇండియాకి వెళ్ళిపో” అన్నారు… అదే సన్నివేశంతో ప్రారంభమయ్యే హన్సల్ మెహతా డైరెక్షన్‌లో రూపొందిన వెబ్ సిరీస్ “గాంధీ” ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది.
ఆ తర్వాత కథ కాఠియావాడ్‌కి తిరిగి వెళ్తుంది… 18 ఏళ్ల విద్యార్థి, BA పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతూ, తండ్రి కావాలనే ఒత్తిడి, కుటుంబ అంచనాలతో గందరగోళంలో ఉన్న మోహనదాస్ కరమచంద్ గాంధీ ని మనం చూస్తాం.
ప్రపంచానికి కొత్తగా చెప్పబోయే గాంధీ కథ!
TIFFలో ప్రీమియర్ అయిన ఈ సిరీస్‌లో తొలి రెండు ఎపిసోడ్‌లు ప్రదర్శించారు.
దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ — “గాంధీ కథ అనేది నేను చెప్పగలిగిన అతిపెద్ద కథ. 50వ ఎడిషన్ TIFFలో ప్రదర్శించటం గర్వంగా ఉంది. గాంధీ తనకు తెలియకుండానే ప్రపంచాన్ని మార్చేశాడు. ఆ ప్రయాణం అందరినీ ప్రేరేపించాలి” అన్నారు.
2019లోనే ప్రొడ్యూసర్ సమీర్ నాయర్, డైరెక్టర్ మెహతా, హీరో ప్రతీక్ గాంధీ ఈ ప్రాజెక్ట్‌పై మొదటి చర్చలు మొదలుపెట్టారు
స్టేజ్ నుండి స్క్రీన్‌కి గాంధీ!
‘స్కామ్ 1992’లో హర్షద్ మెహతా పాత్రతో సంచలనం సృష్టించిన ప్రతీక్ గాంధీ గత 10 ఏళ్లుగా “మోహన్ నో మసాలో” అనే గుజరాతీ నాటకంలో గాంధీ పాత్ర పోషించారు. ఆ అనుభవమే ఇప్పుడు వెబ్ సిరీస్‌కు బేస్ అయింది.
“నేను గాంధీని మహాత్ముడిగా pedestal మీద పెట్టలేదు. ఒక సాధారణ మోహన్‌గా చూపించాను. అదే అతన్ని నిజమైన వ్యక్తిగా నిలబెడుతుంది” అని ప్రతీక్ తెలిపారు.
సిరీస్‌లో ఏం చూడబోతున్నాం?
సీజన్ 1 1888 నుంచి 1915 వరకూ గాంధీ లండన్ వెళ్లి లా చదివిన కాలం.
సీజన్ 2 & 3 ఇండియాలో ఆయన రాజకీయ ప్రస్థానం, స్వాతంత్ర్య ఉద్యమం నుంచి 1948 వరకు.
‘మోహన్’గా మొదలై ‘మహాత్మ’గా మారిన ఈ ప్రయాణం గ్లోబల్ ఆడియెన్స్‌ని ఎంతవరకు కదిలిస్తుందో చూడాలి!