తెలుగు సినిమా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ చాలా పెద్ద రిస్క్ తీసుకుంది అన్నారు అంతా. అయితే ఇప్పుడు మైత్రీ గోల్డ్ మైన్స్ తవ్వుకోవటానికి రెడీ అయ్యిందని అందరికి అర్దమవుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ స్టార్ హీరో అజిత్ కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చింది మైత్రీ. నిర్మాతలు అజిత్ కెరీర్‌లోనే రికార్డ్ బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు, ఇటీవల విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌తో, మైత్రీ బంగారం కోసం సిద్ధమైంది.
రీసెంట్ గా ‘పట్టుదల’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అజిత్ (Ajith Kumar) పని అయ్యిపోయిందన్నారు ఆ కలెక్షన్స్ చూసి. అయితే ఈ వేసవికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly)తో మరోసారి ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. ఆయన హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. త్రిష హీరోయిన్. తాజాగా తమిళ్ టీజర్ (Good Bad Ugly Teaser)ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అజిత్ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ కామెడీ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 10న (Good Bad Ugly Release Date) బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ వీడియో మీరూ చూడండి.
తమిళ ట్రేడ్ , మీడియా వ్యక్తులు స్వయంగా మైత్రీ లోటులో ఉందని అన్నారు . మైత్రీ వారు కోలుకోవడానికి ఈ చిత్రం నుండి భారీ థియేట్రికల్ కలెక్షన్స్ అవసరం. GBU టీజర్ తాజాగా విడుదలై, అది ఆకట్టుకుంది. అభిమానులకే కాదు ప్రేక్షకులందరికీ ఫుల్ ఫీస్ట్ అందిస్తోంది. ప్రతి షాట్ ఐకానిక్‌గా కనిపిస్తుంది. BGM,ప్రొడక్షన్ వాల్యూస్, మిగతావన్నీ అద్భుతంగా ఉన్నాయి. అజిత్ అదిరిపోయేలా ఉన్నాడు. జివి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తం టీజర్‌కి మరింత కిక్‌ని ఇచ్చింది. అధిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌తో అందరి ఊహలకు అందనంతగా అందించాడు మరియు మైత్రి బంగారం కోసం సిద్ధమైంది