పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా విడుదలకు మళ్లీ రెండు రోజులు మాత్రమే ఉండగా, హైదరాబాద్ ప్రీమియర్ షోలు విషయంలో ఇబ్బంది నెలకొంది.

ఏపీ వ్యాప్తంగా నిర్మాణ సంస్థ బాగా కాన్ఫిడెన్స్‌తో బుధవారం రాత్రి నుండి పేమెంట్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తూ, అడ్వాన్స్ బుకింగ్స్‌ కూడా ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి అక్కడ మంచి డిమాండ్‌తో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

కానీ తెలంగాణలో పరిస్థితి వేరేగా ఉంది. ఇటీవల అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన విషాద ఘటన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలపై కఠినంగా స్పందించింది. దాంతో హైదరాబాద్‌లో హరి హర వీర మల్లు ప్రీమియర్స్‌కి అనుమతులు లభించే అవకాశాలు తగ్గిపోయాయి.

ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ప్రభుత్వం చివరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక హైదరాబాద్‌లో అభిమానులు ప్రీమియర్‌కి నిరాశతో మిగిలిపోతారా? అన్నది మరోరోజులో తేలనుంది.

అంతకుముందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకోవడం, సోషల్ మీడియాలో హంగామా చేయడం చూస్తే… వీరికి షో ఉంటే మరో కోలాహలానికి తావుండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

, , , , , ,
You may also like
Latest Posts from