(FILES) Actor Val Kilmer arrives at the 54th Annual GRAMMY Awards held at Staples Center on February 12, 2012 in Los Angeles, California. Actor Val Kilmer died on April 1 in Los Angeles. He was 65. (Photo by Larry Busacca / GETTY IMAGES NORTH AMERICA / AFP)

ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ 65 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. మంగళవారం తమ నివాసమైన లాస్ ఏంజిల్స్ లో కన్నుమూశారని ప్రకటించారు. తీవ్రమైన న్యుమోనియా సమస్య ఆయన మరణానికి కారణమని కూతురు మర్సిడిస్ కిల్మర్ మీడియాకు తెలిపారు.

2014లో కిల్మర్ కు గొంతు క్యాన్సర్ నిర్దారణ అవగా.. ఆయన దాని నుంచి పోరాడి కోలుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన న్యుమోనియా సమస్యతో ప్రాణాలు కోల్పోవటం విషాదమే.

ఇక కిల్మర్ 1984లో ‘టాప్ సీక్రెట్’ అనే ఫిల్మ్‌తో సినిమా జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ‘టాప్ గన్’, ‘రియల్ జీనియస్’, ‘విలో’, ‘హీట్’, ‘ది సెంట్’, ది డోర్స్’, ‘బ్యాట్మన్ ఫోరెవర్’, ‘రియల్ జీనియస్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

2021లో కిల్మర్ థ్రోట్ కేన్సర్ కారణంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ.. ‘టాప్ గన్: మావెరిక్’ చిత్రంలో నటించేందుకు నిర్ణయించుకున్నారు. అదే ఏడాది అయన జీవిత కథ ఆధారంగా ‘వాల్’ అనే డాక్యుమెంటరీ విడుదలైంది.

ఈ డాక్యుమెంటరీలో ఆయన కుమారుడు వాల్ కిల్మర్ పాత్రకు వాయిస్ అందించారు. వాల్ అనేక యానిమేటెడ్ చిత్రాలకు వాయిస్ ఓవర్ కూడా అందించారు. వాటిలో ‘ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్’ ఒకటి.

ఆయన తన కెరీర్ లో రాబర్ట్ డౌనీ జూనియర్, డెన్జెల్ వాషింగ్‌టన్ వంటి ప్రముఖ నటీనటులతో వాల్ కలిసి పనిచేశారు. ‘జోర్రో’ చిత్రంలో తన స్పోకెన్ వర్క్ కోసం గ్రామీ అవార్డుకు నామినేట్ కూడా అయ్యారు.

1991లో ‘ది డోర్స్’ చిత్రంలో సింగర్ మోరిసన్ పాత్ర కిల్మర్ కెరీర్ లో బాగా పాపులరైన పాత్రగా చెబుతారు. అంతేకాదు ఆ సినిమాలోని కాస్ట్యూమ్ స్టైల్ ని ఆయన ఒక సంవత్సరం వరకు ధరించి, వార్తల్లో నిలిచారు.

#Top Gun, #Val Kilmer

By admin