కొంతకాలంగా వెండితెరపై కనిపించని సమంత, తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీవితం, కెరీర్‌, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత పూర్తి స్థాయిలో ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోన్న సమంత… ఇప్పుడు తాను చాలా బలంగా, సంతోషంగా ఉన్నానని చెప్పింది.

“కీర్తికీ, హిట్ సినిమాలకీ అతీతంగా జీవించడం నేర్చుకున్నాను. స్వేచ్ఛగా, స్వాతత్రంగా జీవించడమే నిజమైన విజయమని నాకు స్పష్టమైంది” అంటూ చెప్పింది సమంత.

గత రెండేళ్లలో తాను నటించిన సినిమాలు రిలీజ్ కాలేదని, కానీ ఆ విరామాన్ని స్వీయ వృద్ధి, ఆత్మ పరిశీలన కోసం ఉపయోగించానని చెప్పింది.

“ప్రతి రోజు ఉత్సాహంగా నిద్రలేస్తున్నాను. ఇప్పుడు నా జీవితాశయం ఏంటో నాకు స్పష్టంగా తెలుసు” అంటూ ధైర్యంగా చెప్పింది.

పర్సనల్‌గా ఆమె చెప్పిన మాటలు చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారుతున్నాయి.

“ఇప్పుడు నేను నిజమైన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను” అనే మాటపై నెట్‌ ఫ్యాన్స్‌ పాజిటివ్‌ రియాక్షన్లు ఇస్తున్నారు. అయితే అదే సమయంలో కావాలనే ఇలా సమంత మాట్లాడిందా అని కొందరు డిస్కషన్ చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత తన స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. అదే సమయంలో హిందీ లో ‘రక్త్ బ్రహ్మాండ్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.

You may also like
Latest Posts from