సినిమా వార్తలు

ఇనయా సుల్తానా ‘మదం’,ఎవరి కోరికలు తీర్చడానికి ఈ తెగింపు? !

టాలీవుడ్‌లో 2026 కొత్త ఏడాది అదిరిపోయే బోల్డ్ ట్రీట్‌తో మొదలైంది. బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా లీడ్ రోల్‌లో నటించిన ‘మదం’ మూవీ థియేటర్లలో సెగలు పుట్టిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే అనుకుంటే పొరపాటే.. ఈ సినిమా వెనుక ఒక గగుర్పాటుకు గురిచేసే పగ, ప్రతీకారం, పచ్చినిజాలు దాగి ఉన్నాయి.

ఎవరికి మదం ఎక్కింది? ఆ కక్కుర్తి ఎవరి కోసం?

ఈ సినిమా మనల్ని 1980ల నాటి గరుకు గ్రామీణ నేపథ్యానికి తీసుకెళ్తుంది. ఊరిలో అధికారం చేతిలో ఉందని విర్రవీగే ఒక అవినీతి పోలీస్ అధికారి, అతని భార్య కలిసి ఒక నిరుపేద కుటుంబం జీవితాన్ని చిందరవందర చేస్తారు. ఆ పోలీస్ అధికారికి ఉన్న అధికార ‘మదం’ ఒక కుటుంబాన్ని ఎలా చిత్రహింసలకు గురిచేసింది అనేది ఇందులో ప్రధానాంశం. ఈ అన్యాయాన్ని ఎదిరించే క్రమంలోనే ఒక సామాన్యుడు చేసే పోరాటం మొదలవుతుంది.

ఇనయా సుల్తానా.. కోరికల వెనుక కోరలు చాచిన ప్రతీకారం!

ఈ సినిమాలో అసలైన స్పైసీ ఎలిమెంట్ ఇనయా సుల్తానా పోషించిన పాత్రే. ఆమె సినిమాలో పురుషులతో సంబంధాలు పెట్టుకుంటూ సంచలనం సృష్టిస్తుంది. అయితే అది కేవలం శృంగార వాంఛల కోసం చేస్తున్న పనా? లేక తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిని మట్టుబెట్టడానికి ఆమె వేసిన ప్లానా? అనేదే ఈ కథలో అసలైన కిక్.

క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా బోల్డ్ సినిమాల్లో కథ ఉండదని అనుకుంటారు, కానీ ‘మదం’లో దర్శకుడు వంశీ కృష్ణ మళ్ల ఒక పవర్‌ఫుల్ సోషల్ డ్రామాను రాసుకున్నారు. సినిమాలో సీన్లు రా అండ్ రస్టిక్‌గా ఉన్నప్పటికీ, అవి కథాంశంలో భాగంగానే వస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సమాజం విధించిన కట్టుబాట్లను ఒక మహిళ ఎలా తుంగలో తొక్కి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది అనేది ఇక్కడ ‘మదం’ దింపే అసలు ఘట్టం.

టెక్నికల్ గా ‘రా’.. ట్రీట్ లో ‘బోల్డ్’!

ఇనయా సుల్తానా తన కెరీర్ లోనే అత్యంత తెగింపుతో కూడిన పాత్రలో నటించి మెప్పించింది. 80ల నాటి వాతావరణాన్ని రవికుమార్ విజువల్స్ అద్భుతంగా చూపించగా, ‘ఈగల్’ ఫేమ్ డేవ్‌జాంద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లలో ఇంటెన్సిటీని పెంచింది.

బాటమ్ లైన్: ‘మదం’ అనేది కేవలం ఒక మహిళ శృంగార ప్రయాణం కాదు, అది అణచివేతపై ఒక బాధితురాలి తెగింపు. అయితే ఇది పక్కాగా కుర్రాళ్లకు మాత్రమే పరిమితమైన సినిమా, ఫ్యామిలీతో చూడటం కష్టమే!

Similar Posts