తమిళ హీరో ధనుష్‌ తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య వెంకీ అట్లూరితో ‘సార్‌’ చేశారు. పెద్ద హిట్‌ అయ్యింది. ప్రస్తుతం శేఖర్‌కమ్ములతో ‘కుబేర’ చేస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ధనుష్ తో చేయాలని చాలా మంది తెలుగు నిర్మాతలు ఉత్సాహం చూపెడుతున్నారు. అయితే ఆయన రెమ్యునరేషన్ విని వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

ధ‌నుష్ ఓ త‌మిళ చిత్రానికి రూ.25 నుంచి రూ.30 కోట్ల వ‌ర‌కూ తీసుకొనేవాడు. తెలుగులో త‌న రెమ్యునరేషన్ దాదాపు రూ.40 కోట్లు.

ఇటీవ‌ల ఓ సీనియర్ నిర్మాత ధ‌నుష్‌కి క‌లిసి, డైరక్టర్ చేత ఓ క‌థ వినిపించాడ‌ట‌. ఆ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషికం అడుగుతున్న‌ట్టు టాక్‌.

రెండు రాష్ట్రాల్లోనూ ఒకేర‌క‌మైన మార్కెట్ ఉన్న‌ప్పుడు స‌ద‌రు హీరోల‌కు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వ‌డంలో త‌ప్పు లేదనేది వారి వాదన. అయితే తేడా కొడితే అసలు ఇక్కడ ఓపినింగ్స్ కూడా రావనేది నిజం.

ధనుష్ వంటి హీరోల కాల్షీట్ల వెంట ప‌రుగులు పెడుతున్న తెలుగు నిర్మాత‌లు ఈ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిదని సీనియర్ నిర్మాతలు అంటున్నారు!

తాజాగా మరో తెలుగు దర్శకుడికి ఆయన కిశోర్‌ బి అనే దర్శకుడుకి ఓకే చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మించనున్నారనే వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. యువదర్శకుడు కిశోర్‌ ఇటీవలే సామాజిక అంశంతో కూడుకున్న ఓ కథను దిల్‌రాజుకు చెప్పగా, ధనుష్‌కి ఈ కథ కరెక్ట్‌గా ఉంటుందని దిల్‌రాజు భావించి, ధనుష్‌ వద్దకు ఈ కథను తీసుకెళ్లడం, ఆయనకు కూడా నచ్చడం జరిగిందని తెలుస్తున్నది.

,
You may also like
Latest Posts from