సినిమా వార్తలు

హాట్ టాపిక్ : KVN–నాగవంశీ సీక్రెట్ డీల్

భారీ సినిమాలు నిర్మించడం ఒక ఎత్తు… అదే సమయంలో పెద్ద పెద్ద పాన్‌–ఇండియా ప్రాజెక్ట్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయడం మరో ఎత్తు. ఆ స్దాయికి ఇప్పుడే చేరింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ . అందుకు కారణం దమ్మున్న ప్రొడ్యూసర్ ఎస్. నాగ వంశీ.

టాలీవుడ్‌లో సైలెంట్ ఆపరేటర్ లా కనిపిస్తాడు కానీ, మార్కెట్‌లో చేస్తున్న మూవ్స్ మాత్రం టాప్ ప్రొడ్యూసర్లకే టెన్షన్ వచ్చేలా ఉంటాయి. తాజాగా అలాంటి మూవ్ ఒకటి బయిటకు వచ్చి..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

KVN Productions‌తో నాగ వంశీ సీక్రెట్ డీల్ !

దేవర, వార్ 2, లోకా చాప్టర్ : చంద్ర లాంటి భారీ ప్రాజెక్ట్స్‌ను డిస్ట్రిబ్యూట్‌ చేసిన నాగ వంశీ… ఇప్పుడు నేరుగా KVN Productions తో పాన్‌–ఇండియా రేంజ్‌ డీల్ కుదుర్చుకున్నాడు.

KVN ఇక మల్టీ–లాంగ్వేజ్ భారీ సినిమాలు చేస్తుంది.
తెలుగు మార్కెట్ మొత్తం… నాగ వంశీ చేతుల్లోకి!

విజయ్ జన నాయగన్ తో స్టార్ట్ – అది కూడా 9 కోట్ల రిఫండబుల్ డీల్!

తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా జన నాయకుడు (Jan 9th, 2026) ను నాగ వంశీ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు.

థియేట్రికల్ రైట్స్‌ కేవలం 9 కోట్లకే… అది కూడా రిఫండబుల్ బేసిస్ పై తీసుకున్నాడనేది ప్రచారం. ఇండస్ట్రీలో ఈ డీల్ పై “ఎవరికి తెలీని జాగాలో నాగ వంశీ ఆల్రెడీ సెటప్ పెట్టేశాడు” అనే టాక్.

నెక్ట్స్ : యష్ టాక్సిక్ కూడా నాగ వంశీదే!

KVN నెక్ట్స్ భారీ ప్రాజెక్ట్ యష్ – Toxic తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా నాగ వంశీ చేతుల్లోనే. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్ మ్యాప్ మారిపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

తెలుగు స్టేట్స్‌లో విజయ్ కి డీసెంట్ మార్కెట్ ఉండడంతో, నాగ వంశీ ఎంట్రీతో జన నాయగన్ రిలీజ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.

“ఒక వైపు నిర్మాణం… మరో వైపు భారీ డిస్ట్రిబ్యూషన్ డీల్స్. నాగవంశీ తనదైన స్దాయిలో టాలీవుడ్ లో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు.

Similar Posts