ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లోనే ఫుల్ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల ఆయన అన్ని సినిమాటిక్‌ కమిట్‌మెంట్‌లను కూడా పూర్తి చేశారు. ‘హరి హర వీర మల్లు’ మరియు ‘ఓజీ’ సినిమాలను విడుదల చేస్తూ అభిమానులకు ట్రీట్‌ ఇచ్చారు. ఇక ఆయన నటించిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ మాత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

అయితే… పవన్‌ ఇక మళ్లీ సినిమా షూటింగ్స్‌కి వెళ్తారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘హరి హర వీర మల్లు 2’ మరియు ‘ఓజీ 2’ ప్రాజెక్టుల కోసం ఆయన డేట్స్‌ కేటాయించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అనీల్‌ రావిపూడి పవన్‌తో ఓ సోషల్‌ డ్రామా ప్లాన్‌ చేస్తున్నారన్న రూమర్స్‌ కూడా గాలిలో తేలుతున్నాయి. అలాగే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘పవర్‌స్టార్‌’ సినిమా అనే టాక్‌ కూడా ఉంది. కానీ ఇవన్నీ ఇప్పటికి నిజం కాదట.

నిజానికి… పవన్ కళ్యాణ్‌ ఇప్పటికి కొత్త సినిమా కోసం ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి సారించారు. వచ్చే రెండు సంవత్సరాల పాటు సినిమాలకు విరామం ఇవ్వబోతున్నారని, కొత్త ప్రాజెక్టులు అయితే 2027 తర్వాతే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

అంటే పవన్ కళ్యాణ్‌ ఇకపైన కొంతకాలం ఫుల్‌టైమ్‌ పొలిటిషన్!
అభిమానుల కోసం సినిమా స్క్రీన్‌పై ఆయన రీఎంట్రీకి ఇంకా కొంత వెయిట్‌ చేయాల్సిందే!

, , , , , ,
You may also like
Latest Posts from