టాలీవుడ్ బాక్సాఫీస్ రారాజు, రెబల్ స్టార్ ప్రభాస్‌కు నైజాం (తెలంగాణ) మార్కెట్ అంటే జూజూబి. చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో ఈ రీజియన్‌ను ఏలిన ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. ‘బాహుబలి’ నుండి ‘కల్కి’ వరకు ప్రతి సినిమా ఇక్కడ రికార్డుల సునామీ సృష్టించింది. కానీ ఇప్పుడు ‘ద రాజా సాబ్’ విషయంలో జరుగుతున్న పరిణామాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఏమైంది ఆ నైజాం పవర్?
మిగతా అన్ని ఏరియాల్లో ‘రాజా సాబ్’ సందడి మొదలై, ప్రీమియర్ షోలు పడిపోతుంటే.. ప్రభాస్ కోట లాంటి నైజాంలో మాత్రం ఇంకా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అసలు బుకింగ్స్ కూడా ఓపెన్ కాకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రభాస్ రేంజ్ మార్కెట్‌ను ఈ సినిమా నీరుగార్చేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.
నిర్మాత అతి తెలివి.. కోట్లలో నష్టం!
ప్రీమియర్ షోల ద్వారా రావాల్సిన భారీ వసూళ్లకు గండి పడింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీవో (GO) కోసం నిర్మాత ఆఖరి నిమిషం వరకు వేచి చూడటమే.
జీవో రాకపోతే ఏంటి?:
కనీసం సాధారణ రేట్లతో అయినా ప్రీమియర్స్ వేసి ఉంటే రికార్డులు వచ్చేవి. కానీ మొండిగా జీవో కోసం ఎదురుచూడటంతో నైజాం ప్రీమియర్ కలెక్షన్స్ సున్నా అయ్యాయి.
టాక్ బయటకు వచ్చేసింది:
ఆంధ్రాతో పాటు ఇతర ప్రాంతాల్లో షోలు పడిపోవడంతో ‘టాక్’ స్ప్రెడ్ అయిపోయింది. మంచి టాక్ వస్తే సరే, ఒకవేళ తేడా వస్తే మాత్రం నైజాం వసూళ్లపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది.
పవన్ కళ్యాణ్‌తో సాన్నిహిత్యం ఉన్నా.. ఎందుకీ ఫెయిల్యూర్?
ఈ చిత్ర నిర్మాతకు అటు పవన్ కళ్యాణ్‌తోనూ, ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా సరే, సరైన సమయానికి జీవో తెచ్చుకోలేకపోవడం ఏంటని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
జనవరి 9న రెగ్యులర్ షోలకు కూడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం చూస్తుంటే, నిర్మాత కేవలం టికెట్ రేట్ల పెంపు కోసమే పట్టుబట్టి కూర్చున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రభాస్ మార్కెట్ వాల్యూ దెబ్బతింటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్ సైట్‌ను ఫాలో అవ్వండి!

