పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న OG సినిమా మీద జాతీయ స్థాయిలో బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ డైరెక్టర్ సుజీత్‌కి ఓ క్లియర్ వార్నింగ్ ఇస్తున్నారు.

సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం బాగానే ఉంది. కానీ హైప్ ఎక్కడ ఆగాలి? ఎక్కడినుంచి డేంజరస్ అవుతుంది? – ఇదే అసలు ప్రశ్న. అంచనాలు ఆకాశాన్ని తాకితే, ఓకే అయినా గొప్ప సినిమా కూడా సగటుగా కనిపించే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

OG నుండి వచ్చిన లిరికల్ సాంగ్స్ – ప్రత్యేకంగా “గన్స్ అండ్ రోజెస్” – అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. కానీ ఆ వీడియోలో చూపించిన విజువల్స్ సినిమా లో అసలు ఉండవని టీమ్ కన్ఫర్మ్ చేసింది.

ఇదే ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. “మూవీలో లేని షాట్స్‌ని చూపించి మా అంచనాలు పెంచడమేంటి?” అని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో డైరెక్టర్ సుజీత్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ “మూవీ లో ఉన్నదే చూపించు… మోసగించొద్దు” అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ ఒక్కటే – *ప్రోమోషనల్ కంటెంట్ నిజమైన సినిమాను రిఫ్లెక్ట్ చేయాలి. లేదంటే అంచనాలు తప్పుదోవ పట్టిస్తాయి.

అంటే, OG మీద బజ్ రెట్టింపు అవుతున్నప్పటికీ, ఫ్యాన్స్‌లో ఆందోళన కూడా పెరుగుతోంది. సుజీత్ ఈ వార్నింగ్‌లను సీరియస్‌గా తీసుకుంటాడా? లేక మరోసారి ఫ్యాన్స్ అంచనాలను మించి కొత్త షాక్స్ ఇస్తాడా?

, , , ,
You may also like
Latest Posts from