లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమాతో కాదు, తన ఆత్మగౌరవం మరియు హక్కుల కోసం ఆయన చేసిన న్యాయపోరాటంతో! తన అనుమతి లేకుండా తన పేరును, ఫోటోలను, కనీసం ‘KH’ అనే పొట్టి పేరును వాడుకుని వ్యాపారాలు చేస్తున్న వారికి మద్రాస్ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఏమిటీ పర్సనాలిటీ రైట్స్ (Personality Rights)?

ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును (పేరు, గొంతు, ఫోటో, సిగ్నేచర్) వారి అనుమతి లేకుండా ఇతరులు వాడుకోకుండా ఉండే హక్కునే ‘పర్సనాలిటీ రైట్స్’ అంటారు. కమల్ హాసన్ ఈ హక్కుల కోసం సోమవారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇమేజ్‌ను వాడుకుని టీ-షర్ట్లు, మగ్‌లు అమ్మడం మాత్రమే కాకుండా.. ఏఐ (AI) టెక్నాలజీతో తన ముఖాన్ని అసభ్యకర వీడియోల్లో వాడుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కోర్టు తీర్పు: ఎవరైనా సరే ఆగాల్సిందే!

జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఈ కేసులో కమల్‌కు అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చారు.

నో పర్మిషన్.. నో బిజినెస్: కమల్ అనుమతి లేకుండా ఆయన పేరుతో ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.

డీప్‌ఫేక్ వీడియోలపై నిషేధం: ఏఐ టెక్నాలజీని వాడుకుని కమల్ ముఖాన్ని మార్ఫింగ్ చేయడం లేదా అసభ్యకరంగా చూపించడం నేరం.

‘ఉలగనాయగన్’ టైటిల్: కేవలం పేరు మాత్రమే కాదు, ఆయన బిరుదులను కూడా వాణిజ్య అవసరాలకు వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది.

#AI Fake Photos, #Kamal Haasan, #Madras High Court, #Personality Rights, #Ulaga Nayagan

By admin