‘కొత్త లోక’ సినిమా గురించే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగిన వాంపైర్ గా కనిపించింది. ఈ సినిమాతో మలయాళంలో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించారు. ఈ యూనివర్స్‌లో భాగంగా ముందుగా కొత్త లోక ను రిలీజ్ చేసిన మేకర్స్, అద్భుతమైన విజువల్స్, ఫైట్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కళ్యాణి ఫైట్స్‌లో చూపిన ఎలివేటెడ్ యాక్షన్, సూపర్ పవర్స్ సన్నివేశాలు ప్రతి సీన్‌లో హారర్, థ్రిల్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి అందించాయి. దాంతో ‘కొత్త లోక’ ఓ రేంజ్ లో ఒక్కసారిగా భాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది.

‘లోక’ ఆగస్టు 28న విడుదలైంది. తెలుగులో 29న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ మార్నింగ్ షోస్ పడలేదు. ఈవెనింగ్ & లేట్ నైట్ షోస్, అదీ కొన్ని ఏరియాల్లో మాత్రమే పడ్డాయి. తెలుగులో ప్రోపర్ పబ్లిసిటీ చేయలేదు. అయినా సరే ఆడియన్స్ ఆదరించారు. అసలు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే…

మలయాళంలో మొదటి రోజు ‘లోక’కు రూ. 2.70 కోట్లు వచ్చాయి. ప్రీమియర్స్, ఫస్ట్ డే హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు. దాంతో కేవలం మలయాళ వెర్షన్ రూ. 3.65 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో 35 లక్షల రూపాయలు వచ్చాయి. ఆగస్టు 30న తెలుగులో పూర్తి స్థాయిలో సినిమా విడుదల అయ్యింది. ఆ రోజు రూ. 1.20 కోట్లు కలెక్ట్ చేసింది.

టాలీవుడ్ క్రిటిక్స్ కూడా సినిమా బావుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుకంజ వేయలేదు. రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

150 Cr క్లబ్ ఎంట్రీ

రిలీజ్ రోజు నుండి కేవలం 10 రోజులలోనే ‘కొత్త లోక’ 150 కోట్ల గ్రాస్ ని అధిగమిస్తూ బాక్సాఫీస్ క్లబ్‌లోకి ఎంటర్ అయింది. కేరళలో ఓనమ్ ఫెస్టివల్ అడ్వాంటేజ్‌తో సినిమా 50 కోట్ల గ్రాస్ మైలురాయిని కూడా దాటింది.

నెక్ట్స్ టార్గెట్ – 200 Cr

ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే, మూడో వీకెండ్‌కి ముందే 200 కోట్ల మైలురాయి దాటే అవకాశం ఉంది. ఈ ఫలితంతో ‘కొత్త లోక’ నిజంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

, , , , ,
You may also like
Latest Posts from