పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే క్రేజ్ వేరే లెవెల్. బాహుబలి తరువాత ఆయనకి వచ్చిన పాపులారిటీ, పాన్-ఇండియా ఇమేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏ సినిమా వచ్చినా థియేటర్లలో హౌస్‌ఫుల్ కచ్చితం అన్న నమ్మకం క్రేజ్ ని చూపిస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ డేట్స్ కోసం టాలీవుడ్ లో పెద్ద యుద్దమే జరుగుతోంది!

ఇప్పుడే ప్రభాస్ The Raja Saab, Fauji షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన చేతిలో లైన్‌అప్ చూస్తే టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా దృష్టి ప్రభాస్ మీదే ఉంది. సందీప్ వంగా Spirit , నాగ్ అశ్విన్ Kalki 2 , ప్రసాంత్ వర్మ సినిమా, ఇంకా ప్రశాంత్ నీల్ Salaar 2. వీళ్లందరూ ఇప్పుడు ప్రభాస్ డేట్స్ కోసమే ఎదురుచూస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే…

ప్రభాస్ డేట్స్ ఇవ్వగానే ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ హీరో ఎవరికి ప్రాధాన్యం ఇస్తాడు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో Dragon పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ Salaar 2 మొదలుపెట్టాలి. కానీ ఆయన 2026 రెండో సగ భాగంలోనే ఫ్రీ అవుతాడు. అంటే అప్పటివరకు మిగతా డైరెక్టర్స్ అందరూ ప్రభాస్ వైపు చూస్తూ ఎదురు చూడాల్సిందే.

ప్రభాస్ డేట్స్ లేకపోతే కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ హ్యాంగ్ అవుతాయి. డైరెక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

“ప్రభాస్ డేట్స్ ఎవరికీ దక్కుతాయి?” అన్నది ఇప్పుడు టాలీవుడ్ లోని నెంబర్ వన్ డిబేట్.

, , , , , ,
You may also like
Latest Posts from