సెలబ్రెటీలు ఎక్కడికైనా వెళితే అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడటం సహజం. కానీ ఆ హడావుడిలో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటి సంఘటననే ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డ్స్ ఈవెంట్‌లో మంచు లక్ష్మీ ఎదుర్కొన్నారు.

ఆ సమయంలో ఓ వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్య చేసినట్టు సమాచారం. ఆ వ్యాఖ్య విన్న మంచు లక్ష్మీ ఒక్క క్షణం కూడా ఆగకుండా కౌంటర్ ఇచ్చారు. “అంత ధైర్యం ఉంటే బయటికి వచ్చి నేరుగా నా ముఖం మీద చెప్పు” అంటూ సవాల్ చేశారు. అయితే ఆ వ్యక్తి నోరు మూసుకుని సైలెంట్‌గా ఉండిపోవడంతో వాతావరణం ఒక్కసారిగా టెన్షన్‌గా మారింది.

తర్వాత మాత్రం లక్ష్మీ తన కూల్ మూడ్‌లోకి వెళ్లి, ఇతర అభిమానులతో నవ్వుతూ సెల్ఫీలు ఇచ్చారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ షేర్ చేస్తున్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం మంచు లక్ష్మీకి పెద్ద సినిమాలు లైన్‌లో లేనప్పటికీ, ముంబయిలో సెట్ అయిన ఆమెకు బాలీవుడ్ OTT ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆసక్తికరమైన ఆఫర్లు వస్తున్నాయని టాక్.

, , , ,
You may also like
Latest Posts from