కాంతారా ఎఫెక్ట్ తెలుగు సినిమాపై ఇంకా తగ్గలేదు. తాజాగా రిలీజైన భైరవం టీజర్ ఆ విషయం మరోసారి ప్రూవ్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మల్టీ స్టారర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ సినిమా టీజర్ లో చివరి షాట్ కాంతారాని గుర్తు చేస్తోంది. హీరోయిజాన్ని కృష్ణుడితో పోలుస్తూ జయసుధ వాయిస్ ఓవర్ లో ఓ ఫైట్ సీక్వెన్ ని చూపిస్తూ టీజర్ రివిల్ అయ్యింది. ముగ్గురు స్నేహితులు, ఓ గుడి చుట్టూ సాగే కథ ఇది.
బెల్లంకొండ శ్రీను, మంచు మనోజ్, నారా రోహిత్‌లతో కలిసి ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ‘భైరవం’ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
https://youtu.be/cQGjh-kJTyc?si=d7xthwt3J9DA_VJb
‘ఆ రామలక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ శీను గాడు ఉన్నాడు’ అంటూ బెల్లంకొండ శీను చెప్పే డైలాగ్‌తో ‘భైరవం’ సినిమా పై క్లారిటీ ఇచ్చేశారు.
రామలక్ష్మణులు నారా రోహిత్, మంచు మనోజ్‌లు అయితే.. వాళ్ల సేవకుడు శీను బెల్లంకొండ అన్నమాట.
టీజర్ లో యాక్షన్ కి పెద్దపీట వేశారు. శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ముగ్గురికీ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్ సమపాళ్లలో దక్కాయి.
అయితే ఇందులో శ్రీను క్యారెక్టర్ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్. ఆ క్యారెక్టర్ చుట్టూనే డ్రామా వుంది. ముగ్గురి క్యారెక్టర్ లుక్స్ యాక్షన్ కి కథకి తగ్గట్టుగా వున్నాయి. 1.27 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన టీజర్‌లో యాక్షన్ ఎలిమెంట్స్ మెండుగా కనిపించాయి.