సాధారణంగా ఓటిటి అంటే ఫ్యామిలీతో కూర్చుని చూసే ఫ్లాట్ ఫామ్ కాబట్టి …థియేటర్ వెర్షన్ లో ఉన్న హింస, రక్తపాతం, శృంగారం వంటివి టోన్ డౌన్ చేస్తారు. అయితే ఇప్పుడు రివర్స్ లో జరుగుతోంది. థియేటర్ లో ఓ సారి చూసిన వారు మరోసారి సినిమా చూడాలంటే ఏదో ఒకటి వారికి స్పెషల్ కావాలి. పుష్ప2 సినిమాకు అలాగే అదనపు సీన్స్ తో ఓటిటి రిలీజ్ ఇచ్చారు. ఇప్పుడు మార్కో కు కూడా అలాంటిదే జరగబోతోంది.
మార్కో సినిమాలోని వయొలెంట్ కంటెంట్ సెన్సార్ కట్స్‌కి గురి అయ్యింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చి కూడా భారీ సెన్సార్ కట్స్ వేశారు. తీవ్రమైన రక్తపాతం సన్నివేశాలు వద్దని కట్స్ చెప్పారు.
ఇప్పుడు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసే సమయంలో సెన్సార్‌కి ఏ వర్షన్ అయితే పంపించారో దాన్నే కట్స్ లేకుండా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
అందుకు సంబంధించిన సౌండ్ మిక్సింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే వర్క్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మార్కో సినిమాలో మామూలుగానే హింసాత్మక సన్నివేశాలు పీక్స్‌లో ఉన్నాయి. అలాంటి సన్నివేశాలు ఇప్పుడు మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.
మలయాళ మార్కో సినిమా గత ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కొన్ని కారణాల వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.