బాక్సాఫీస్ వద్ద “మాస్ జాతర” వర్కవుట్ కాకపోయినా… కూల్‌గా, టెన్షన్ లేకుండా ముందుకెళ్లే స్టైల్‌ రవితేజదే. “మాస్ జాతర” బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యినా రవితేజ దాన్ని తన బుర్రలోకి ఎక్కించుకోవటం లేదు! డిజాస్టర్ రిజల్ట్ చూసాక చాలా మంది స్టార్‌లు ప్రమోషన్, ఇంటర్వ్యూలు, బ్లేమ్ గేమ్‌లో పడితే… రవితేజ మాత్రం? జీరో సెంటిమెంట్. నో డ్యామేజ్ మోడ్.

“ఫ్లాప్ వచ్చిందా? సరే. నెక్స్ట్ షాట్!” అన్నట్టు వెంటనే వర్క్ మోడ్‌లోకి జంప్. ఇప్పటికే #RT76 సెట్స్‌పైకి జంప్ అయి, రొమాంటిక్ డ్యుయెట్ షూట్ స్టార్ట్ చేసేశారు రవితేజ. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి, ఆశికా రంగనాథ్‌తో కలిసి సాంగ్ షూట్ చేస్తున్నారు.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని టైటిల్ ఫిక్స్ చేసారట ఈ చిత్రానికి . ఈ విజ్ఞప్తి వివరాల కోసం ప్రేక్షకులను వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌కి రమ్మంటున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తొలుత ‘అనార్కలి’ అనే టైటిల్‌ను అనుకున్నారు. టైటిల్ వినగానే ఫ్యామిలీ పంచ్, ఫన్, ఎమోషన్… అన్నీ గుర్తుకు వస్తున్నాయా? అదే ఈ సినిమా టోన్ అంటున్నారు ఇన్‌సైడర్స్.

ఇటీవల వరుసగా మాస్-యాక్షన్ మూడ్‌లోనే ఉన్న రవితేజ, ఈసారి మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో గేర్ మార్చబోతున్నాడు. “మాస్ జాతర” ఫలితం తర్వాత ఈ మూవీనే గుడ్ రిలీఫ్, న్యూ ఎనర్జీ ఇవ్వబోతుందన్న నమ్మకం టీమ్‌లో ఉంది.

ఇదిలా ఉండగా రవితేజ నెక్ట్స్ సినిమాలు లైనప్ ఇప్పటి యంగ్ హీరోలకు కూడా లేదని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమాను కూడా ఒకే చేసాడు. ఆ తర్వాత మ్యాడ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మాహారాజ. ఈ మూడు సినిమాలతో పాటు దర్శకుడు త్రినాథరావు నక్కిన ఆస్థాన రైటర్ గా ఎన్నో సినిమాలకు రైటర్ గా పనిచేసిన బెజవాడ ప్రసన్న మాస్ రాజా కోసం ఓ కథ రెడీ చేసాడు.

ఇటీవల మాస్ మహారాజను కలిసిపాయింట్ వినిపించగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ఇక మాస్ రాజా కెరీర్ లో 80వ సినిమాగా బింబిసార, విశ్వంభర సినిమాల దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్ లో సినిమా రానుందట. ఈ సినిమా ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు సమాచారం. ఇలా ఏకంగా ఆరు సినిమాలను లైనప్ చేసి ఉంచాడు మాస్ మహారాజ్.

, , , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com