అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తై ఓటిటిల్లోకి వచ్చేసింది. ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ లో ఈ చిత్రం సత్తాచాటుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. క్రేజ్‍కు తగ్గట్టే ఆరంభం నుంచి కలెక్షన్ల సునామీ సృష్టించింది సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మూవీ. థియేట్రికల్ రన్ ఎండ్ అవడంతో పుష్ప 2 క్లోజింగ్ ఫైనల్ కలెక్షన్ల రికార్డ్ స్దాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు చిత్రం లాభాల విషయమై ఓ లాయిర్ కోర్ట్ కు వెళ్లారు.

‘పుష్ప2: ది రూల్‌’కు (Pushpa 2) వచ్చిన లాభాలను చిన్న చిత్రాలకు బడ్జెట్‌ రాయితీకి వినియోగించాలని, జానపద కళాకారుల పింఛన్‌ కోసం కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో (TG High Court) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

‘పుష్ప2: ది రూల్‌’కలెక్షన్స్ విషయమై న్యాయవాది నరసింహారావు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు వల్ల ‘పుష్ప2’ చిత్రానికి భారీగా ఆదాయం వచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరీ బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. బెనిఫిట్‌ షో, టికెట్‌ ధరలు పెంపునకు అనుమతివ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదని న్యాయస్థానానికి వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ‘ఇప్పటికే బెనిఫిట్‌ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా’ అని సీజే ప్రశ్నించగా, వాటి వల్ల వచ్చిన లాభం గురించే పిటిషన్‌ దాఖలు చేశామని న్యాయవాది వివరించారు.

అయితే, అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

పుష్ప 2: ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 18) ప్రకటించింది.

“చాలా రికార్డులు బద్దలుకొట్టి.. కొన్ని కొత్త రికార్డులను సృష్టించి.. భారతీయ సినిమా ఇండస్ట్రీ హిట్‍గా పుష్ప 2 ది రూల్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ సాధించింది. రికార్స్డ్ రప్పారప్పా” అని మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

, , ,
You may also like
Latest Posts from