సినిమా వార్తలు

త్రివిక్రమ్ ఇందులోనూ వేలెట్టాడా…డిజాస్టర్ అయ్యిందే

మాస్ జాతర ప్రీమియర్స్ పూర్తయ్యేసరిగా టాక్ వచ్చేసింది. టైటిల్ మాస్, హైప్ మాస్, రవి తేజ ఎనర్జీ ఫుల్ పవర్ — కానీ స్క్రీన్ మీద మాత్రం ఏం జరగలేదు. రొటీన్ కథ, దారుణమైన పేసింగ్, అవుడ్ డేటెడ్ కమర్షియల్ ట్రీట్‌మెంట్… ప్రేక్షకులు ఇలా అనుకుంటూ బయటకొచ్చారు: “మాస్ కాదు… మిస్ఫైర్ జాతర!”

ట్రేడ్ టాక్ ఇదే — ఈ సినిమా ఆల్-టైమ్ బాక్సాఫీస్ సెట్బ్యాక్ రవితేజకు. సితార ఎంటర్టైన్మెంట్స్‌కి కూడా ఇది భారీ నష్టాల సినిమా. టాక్ ప్రకారం ప్రాజెక్ట్‌కి ₹25–30 కోట్ల నష్టం వచ్చే అవకాశం.

త్రివిక్రమ్ ఇందులో కూడా వేలెట్టాడా?

ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఓ హాట్ టాపిక్ — ఈ సినిమా కథలో త్రివిక్రమ్ కూడా ఫింగర్స్ పెట్టాడట! సితార ప్రాజెక్ట్ అంటే త్రివిక్రమ్ సలహాలు, గైడెన్స్ అనేది ఇండస్ట్రీకి తెలిసిన సంగతే. ఎవరు అఫిషియల్‌గా చెప్పకపోయినా… “సినిమా వినిపిస్తారు… మార్పులు సూచిస్తారు… ఫైనల్ కట్ కూడా చెక్ చేస్తారు” అనే టాక్ ఎప్పుడూ ఉంటుంది.

ఈసారి కూడా…

సముద్రఖని క్యారెక్టర్ ఐడియా — త్రివిక్రమ్ గారి సజెషన్ అంట
సత్య – శ్రీనివాస్ రెడ్డి కామెడీ ట్రాక్ — ఆలోచన కూడా అక్కడినుంచే
ట్రాక్ షూట్ అయింది… కానీ లెంగ్త్ వల్ల తీసేశారు
సముద్రఖని రోల్ కథలో నేచురల్‌గా లేనందున – స్క్రీన్‌ప్లే ఇంపాక్ట్ అయింది

అంటే?
మూల కథే బలహీనంగా ఉంటే… ఎంత గ్లామర్, ఎంత పెద్ద బ్రెయిన్ పని వేసినా సినిమా పనిచేయదు.
ఇక్కడ అదే జరిగింది.

ఏదైమైనా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యాడా? అఫీషియల్‌గా ఎవరూ చెప్పరు. కానీ ఇండస్ట్రీలో మాట మాత్రం ఇదే

Similar Posts