
సంక్రాంతి రేసులో మాస్ మహారాజా ఎంట్రీ! – రవితేజా RT76 స్లాట్ కన్‌ఫామ్
మాస్ జాతరతో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజా, ఇప్పుడు మరోసారి రీసెట్ బటన్ నొక్కాడు. తాజాగా ఆయన కొత్త సినిమా ‘RT 76’ ని సంక్రాంతి 2026కి లాక్ చేశారు — అంటే బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ ఫైర్ ఖాయం!
సంక్రాంతి రేస్ ఇప్పటికే హీట్‌లో! ఈ సీజన్‌కు ఇప్పటికే లైనప్ ఇలా ఉంది
ప్రభాస్ – ది రాజా సాబ్
చిరంజీవి – మన శంకర వర ప్రసాద్ గారు
నవీన్ పోలిశెట్టి – అనగన ఒక రాజు
శర్వానంద్ – నారి నారి నడుమ మురారి
తమిళ డబ్ బిగీస్: జన నాయకన్ (విజయ్), పరాశక్తి
ఇంత భారీ పోటీ ఉన్నా, రవితేజా వెనక్కి తగ్గలేదు! RT76 సంక్రాంతి నుంచి ఒక్క ఇంచు కూడా కదలదని టీమ్ క్లియర్‌గా ప్రకటించింది.

టైటిల్ & ఫస్ట్ లుక్ – ఈ రోజు 3:33 PMకి!
దర్శకుడు కిషోర్ తిరుమల (నెనుసైలజా, ఉన్నది ఒకటే జీవితం ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని SLV సినిమాస్ నిర్మిస్తోంది.
మ్యూజిక్ భీమ్స్ సిసిరోలియో, అంటే ఎనర్జీ గ్యారంటీ!
టైటిల్ రూమర్స్ ప్రకారం సినిమా పేరు — “భర్త మహాశయులకు విజ్ఞాప్తి”.
ఇక అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఇచ్చిన హింట్స్ చూసి ఫ్యాన్స్‌లో కుతూహలం టాప్‌కి చేరింది.
ఏదైమైనా ‘మాస్ జాతర’ తర్వాత రవితేజా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి 2026లో తారల వర్షం కురిసినా, మాస్ మహారాజా తన స్లాట్ కాపాడుకున్నాడు!
