సినిమా వార్తలు

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ డేట్ .. ఎక్కడ చూడొచ్చంటే?

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వింటేజ్ చిరంజీవి గ్రేస్ తో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్‌తో సంక్రాంతి సీజన్‌లో ఫుల్ మీల్స్‌లా ఆడియన్స్‌ను అలరించింది. చిరంజీవి ఎనర్జీ, మాస్ టైమింగ్, ఫ్యామిలీ టచ్… అన్నీ కలిసొచ్చి సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఈ సినిమా ఎప్పుడు వచ్చే అవకాసం ఉందనేది హాట్ టాపిక్ గా మారింది.

స్టార్ క్యాస్ట్ ప్లస్ పాయింట్

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో మెప్పించగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్‌తో అదిరిపోయారు. నయనతార, క్యాథరిన్ త్రెసా హీరోయిన్స్‌గా ఆకట్టుకోగా, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రల్లో సినిమాకు మరింత బలం చేకూర్చారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఫుల్‌గా కనెక్ట్ చేసిన సినిమా ఇదే.

ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

ఇప్పుడు అసలు ప్రశ్న… ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ?

ఈ సినిమాకు ఓటీటీ రైట్స్ – ZEE5 దక్కించుకుంది.
శాటిలైట్ హక్కులు – జీ తెలుగు కొనుగోలు చేసింది.
పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం, పెద్ద సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత 30 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అదే లెక్కన చూస్తే…
ఫిబ్రవరి నెలలో ZEE5లో స్ట్రీమింగ్ మొదలయ్యే అవకాశం బలంగా ఉంది.
వాలెంటైన్స్ డే టైమ్‌లో డిజిటల్ రిలీజ్ ఉంటుందన్న టాక్ కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

డిజిటల్‌లో రచ్చ ఖాయం?

థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా… ఓటీటీలో మరింత పెద్ద ఆడియన్స్‌ను చేరుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో కలిసి చూసే ఎంటర్‌టైనర్ కావడంతో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ వ్యూస్, ట్రెండింగ్ లిస్ట్‌లోకి రావడం దాదాపు ఖాయం అనేలా ఉంది.

థియేటర్‌లో మెగా మాస్‌ని ఊపేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయి హంగామా చేయడానికి రెడీ అవుతోంది. మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే మెగాస్టార్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలంటే… ఈ సినిమా మిస్ కాకండి!

Similar Posts