పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ గురించి చాలా కాలంగా ఫిల్మ్ సర్కిల్స్ లోనూ,అభిమానుల్లోనూ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతో అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఉండబోతుందని వార్తలు వచ్చాయి.
అలాగే అకీరానందన్ మెంటార్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీటితో పాటు రామ్ చరణ్ గైడెన్స్ లో అకీరా డెబ్యూకి రెడి అవుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది అతని తల్లి రేణు దేశాయ్ క్లారిటి ఇచ్చేసింది.
తాజా ఇంటర్వ్యూలో, రేణు దేశాయ్ తన కొడుకు OGలో ఉన్నారనే వార్తలు అవాస్తవమని మరియు రామ్ చరణ్ తన నటనా రంగ ప్రవేశానికి అకీరాకు మార్గదర్శకత్వం వహించడం లేదని పేర్కొంది. ఇవన్ని రూమర్స్ అని విశ్వసించవద్దని గట్టిగా చెప్పింది, అకీరా నందన్ పవన్ కళ్యాణ్ OGలో భాగం కాదని పేర్కొంది.