మెగా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ ఇటీవల తన తల్లిగారైన అల్లు కనకరత్నమ్మను కోల్పోయి, కుటుంబ సభ్యులు – సినీ ప్రముఖుల సమక్షంలో అంతిమక్రియలు పూర్తిచేశారు. ఈ నేపధ్యంలోనే మరో షాకింగ్ పరిణామం బయటకొచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) టౌన్ ప్లానింగ్ విభాగం అల్లుఅరవింద్ కి ఘాటైన షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కారణం ఏమిటంటే… జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఉన్న Allu Business Par లో అధికార అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మాణం జరగడం.
GHMC అనుమతి ఇచ్చింది నాలుగు అంతస్తులకే… కానీ అదనంగా పెంట్ హౌస్ నిర్మించడంతో ఇప్పుడు కూల్చివేత సవాల్ ఎదురవుతోంది. అల్లుఅరవింద్ వెంటనే సమాధానం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేశారు.
ఇకపోతే… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన ప్రొడ్యూసర్ గా పేరొందిన అల్లుఅరవింద్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. కొకాపేట్ లో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ఫిలిం స్టూడియో రెడీగా ఉండగా, వారి స్వంత సినిమా థియేటర్ కూడా కట్టడం జరుగుతోంది.
ఇక GHMC ఈ నోటీసుల తర్వాత ఏం జరుగుతుంది? అల్లుఅరవింద్ స్పందన ఏమిటి? పెంథౌస్ కూల్చివేత జరుగుతుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.