జగపతి బాబు ఇటీవల తన చాట్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో సంచలన విషయాలు బయటపెట్టాడు. అతిథిగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చిన సందర్భంలో, 1993లో వచ్చిన క్రైమ్–పాలిటికల్ థ్రిల్లర్ గాయం షూటింగ్ టైమ్‌లో జరిగిన ఒక సీక్రెట్ సంఘటనని గుర్తుచేసుకున్నారు.
“నీతో ఊర్మిళ ఎందుకు దూరంగా ఉంటోంది?” అని వర్మ అడిగాడట. జగపతి బాబు సరదాగా – “అదేమీ కాదు. నాకు ఆమెపై ప్రత్యేక ఇష్టం లేదు, ద్వేషం లేదు కూడా” అని చెప్పాడట. కానీ వర్మ ఆ మాటనే తీసుకుని ఊర్మిళ దగ్గరకు వెళ్లి – *“జగపతి బాబు కు నువ్వంటే ద్వేషం, ఇష్టం లేదు” అంటూ మంట పెడేశాడట!
ఊర్మిళ నేరుగా వచ్చి తనని ప్రశ్నించడంతో జగపతి బాబు బోల్డంత బోర్ ఫీల్ అయ్యాడట. చివరికి వర్మ “నువ్వు ఊర్మిళను ఇష్టపడతానని చెప్పే వరకు షూటింగ్ మొదలు పెట్టను” అని పట్టుబట్టాడట. విసిగిపోయిన జగపతి, “సరే రాము, విను.. నేను ఊర్మిళను ద్వేషిస్తున్నాను. నువ్వు ఇష్టపడే వారందరినీ ద్వేషిస్తున్నాను. నిన్ను కూడా ద్వేషిస్తున్నాను. ఇప్పుడేం చేయాలో చూడు” అని చెప్పేశాడట! దానికి వర్మా “ఇదే నాకిష్టం” అని కూల్‌గా స్పందించాడట.
“ఇలాంటి వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత కష్టం?” అని సరదాగా రివీల్ చేశాడు జగపతి బాబు.
అయితే, వర్మ గురించి ఆయన చివర్లో పొగడ్తలే కురిపించాడు. “సెట్‌లో అసలు టెన్షన్ ఉండదు. ఒకే టేక్‌తో సంతృప్తి పడతాడు. నేను రీటేక్ అడిగినా ‘అవసరం లేదు’ అంటాడు. నిజంగా వర్మ అత్యంత కూల్ డైరెక్టర్. అదీకాక.. గాయం సినిమాలో నన్ను హీరోగా తీసుకోవడం వల్లే నేను స్టార్‌గా నిలబడ్డాను. దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని ఎమోషనల్‌గా చెప్పాడు.