
“పురుషులకి రెండు సమస్యలే ఉన్నాయి” – అనూ ఇమ్మాన్యుయేల్ షాకింగ్ కామెంట్స్!
తెలుగు, తమిళ సినిమాల్లో గ్లామరస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందిన “The Girlfriend” సినిమాలో అనూ “దుర్గా”గా కనిపించింది. మహిళల కోసం నిలబడ్డ, ఆత్మవిశ్వాసం గల ఆ పాత్ర మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అను చాలా ఆనందంగా ఉంది. ఈ నేపధ్యంలో మీడియాతో మాట్లాడింది.
“నేను పవన్ కళ్యాణ్, అల్లుఅర్జున్, నాని, నాగచైతన్య, కార్తి, విశాల్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో పనిచేశాను. కానీ వెనక్కి చూసుకుంటే, కొన్నీ సినిమాలు చేసినందుకు పశ్చాత్తాపం ఉంది. అవి నాకు ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. The Girlfriend మాత్రం భిన్నం — మహిళల గురించి ఒక అర్థవంతమైన సందేశం ఇచ్చింది, నాకూ సృజనాత్మక తృప్తి ఇచ్చింది,” అని అనూ చెప్పింది.
జెండర్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుతూ ఆమె చెప్పింది —
“మహిళలకు ఎప్పుడూ నియమాలే — ఎలా మాట్లాడాలి, ఏమి ధరించాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలు కనాలి… కానీ పురుషులకు రెండు సమస్యలే ఉంటాయి — జాబ్, ఇన్కమ్!”
తన కెరీర్‌పై ఆమె మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది —
“కెరీర్ పరంగా కొంత అసంతృప్తి ఉంది. కానీ జీవితంతో సంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడూ పాత్రల కోసం డెస్పరేట్ కాలేదు. సరైన ప్రాజెక్టులు వాటంతట అవే వస్తాయని నమ్ముతాను. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల్లో ఉన్నాయి, కానీ ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.”
అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. “పురుషులకి రెండు సమస్యలే!” అన్న వాక్యం ఫ్యాన్స్ మధ్యలో వైరల్ అవుతోంది.
