ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘మిరాయ్‌’ ఒకటన్న సంగతి తెలిసిందే. సంచలన విజయం సాధించిన ‘హను – మాన్‌’ తర్వాత తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రమిది. రితికా నాయక్‌ హీరోయిన్. మంచు మనోజ్‌ విలన్ గా నటిస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భారీహంగులతో రూపు దిద్దుకొంటున్న చిత్రమిది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ఊహించని స్పందన వచ్చింది. తేజ సజ్జకు తోడు విలన్‌గా మంచు మనోజ్, విజువల్‌గా గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా, సెప్టెంబర్‌లో థియేటర్లలో సందడి చేయనుంది.

ఇక థియేటర్‌కు ముందే ఈ సినిమాకి వచ్చిన డిమాండ్ చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ‘మిరాయి’ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు మొత్తం రూ. 50 కోట్లకుపైగా అమ్ముడయ్యాయి. డిజిటల్ హక్కులు జియో హాట్‌స్టార్ కొనుగోలు చేయగా, శాటిలైట్ హక్కులు స్టార్ నెట్‌వర్క్ తీసుకుంది. ఆడియో హక్కులను TIPS మ్యూజిక్ దక్కించుకుంది.

ఈ మొత్తం డీల్‌తో నిర్మాతలకు సొమ్ము వచ్చేస్తోంది. థియేట్రికల్ రిలీజ్‌కి ముందే సినిమాకి వచ్చిన కలెక్షన్లు, ‘మిరాయి’పై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. సూపర్ హీరో జానర్‌లో తెలుగులో ఇలా బిజినెస్ జరగడం నిజంగా రేర్.

ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్‌ యోధగా శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్నారు. ఆయుధం చుట్టూ సాగే ఈ కథని, ఒక విజువల్‌ వండర్‌గా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రియ, జయరామ్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పుడు అందరి చూపూ – థియేటర్లలో ‘మిరాయి’ ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఉంది!

, , ,
You may also like
Latest Posts from