హీరో రజనీకాంత్‌ (Rajinikanth)కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ చాలా సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కు ఇక్కడ అదిరిపోయే మార్కెట్ ఉంది. ఆయన రీసెంట్ హిట్ లియో సక్సెస్ గురించి చెప్పక్కర్లేదు. వీళ్లద్దరి కాంబోలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కూలీ’ (Coolie). కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా బిజినెస్ తెలుగులో ఓ రేంజిలో జరిగింది. 50 కోట్లకు అటూ ఇటులో తెలుగు రైట్స్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే బ్రేక్ ఈవెన్ మార్క్ గ్రాస్ వంద కోట్లు రావాల్సి ఉంటుందని అంటోంది ట్రేడ్. పెద్ద ఎమౌంటే ఇది. అయితే రజనీ, లోకేష్ క్రేజ్ తో లాగేయచ్చు.

బంగారం స్మగ్లింగ్‌ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో ఇది ముస్తాబవుతోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ చేసుకుంటోంది. తాజాగా చెన్నై విమానాశ్రయంలో రజనీపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. త్వరలోనే వైజాగ్, హైదరాబాద్‌లలో ఆఖరి షెడ్యూల్‌ జరగనుంది.

మార్చి నెలాఖరకు చిత్రీకరణ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. వచ్చే వారంలోనే దీనిపై స్పష్టత రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from