అప్పట్లో అంటే అశోకుడు టైమ్ లో …ఆయన వరస యుద్దాలు చేస్తూ చివరికి కళింగ యుద్దం చేసి అందులో గెలిచాక అక్కడ జరిగిన రక్తపాతం,శవాలు చూసి మనస్సు వికలమై పశ్చాత్తాప్పడతాడు. ఆ వినాశనానికి తనలో ఉన్నటువంటి కొన్ని శక్తులే ఓ కారణమని భావిస్తాడు. దాంతో ఆ శక్తులు అన్నిటినీ ఓ తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి.. వాటి రక్షణ బాధ్యతను తొమ్మిది మంది యోధుల చేతుల్లో పెడతాడు. తరతరాలుగా వాటి రక్షణ భారాన్ని వారసత్వంగా కొందరు యోధులు తీసుకుంటారు. ఈ క్రమంలో ఎంతోమంది ఆ గ్రంధాలు సొంతం చేసుకుందామనుకున్నా వారి వల్ల కాదు.

అలా ఎన్నో శతాబ్దాలు గడిచాక ఇప్పుడు ఆ గ్రంథాలపై మహావీర్‌ లామా (మంచు మనోజ్‌) కన్నుపడుతుంది. అతనో దుర్మార్గుడు. తనకున్న తంత్ర శక్తులతో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎనిమిది మహిమాన్విత గ్రంథాల్ని సొంతం చేసుకుంటాడు. అయితే అతను కోరుకున్నట్లుగా అమరత్వాన్ని సిద్దించాలంటే తొమ్మిదో గ్రంధం కూడా దొరకాలి. అయితే ఆ గ్రంథాన్ని సొంతం చేసుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే దానికి రక్షణగా ఉంటోంది అంబిక (శ్రియ).

ఆమెకు మహావీర్‌ రూపంలో వస్తున్న ముప్పు జ్ఞాన దృష్టితో తెలిసిపోతుంది. దాంతో ఆ మహావీర్ ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద (తేజ సజ్జా)ను ఎంపిక చేస్తుంది. అతన్ని అగస్త్య మహాముని సలహాపై తనకు దూరంగా పెంచుతుంది. అతను పెరిగి పెద్దయ్యాక తన భాధ్యత ఎలా తెలుసుకున్నాడు..? వేద..మహా యోధగా ఎదిగి… మహావీర్‌ లామా నుంచి ప్రపంచాన్ని ఎలా రక్షించాడు? ఈ క్రమంలో శ్రీరాముడు ఎలా సాయిం చేసారు. అలాగే మిరాయ్‌ అంటే ఏమిటి? చివరకు ఏమైంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎనాలసిస్ :

‘మిరాయ్’ ప్రారంభమై ఎటువంటి ఆలస్యం లేకుండా తన కోర్ థీమ్‌లోకి దూకిపోవటం మనకు నచ్చుతుంది. తొమ్మిది పవిత్ర గ్రంధాలు… రహస్యంగా రక్షణ, అవి తప్పు వ్యక్తుల చేతుల్లో పడితే కలిగే పరిణామాలు – ఇదే కథకి స్పైన్. మొదటి రీల్ నుంచే ఈ మిస్టరీ, థ్రిల్ మిరాయ్‌కి స్పెషల్ టోన్ ఇస్తుంది.

హీరో తేజా ఎంట్రీలో లవ్ ట్రాక్, కామెడీ బిట్స్ లాంటివి లేకపోవడం కొత్తదనమని అనిపించకపోయినా, ఎగ్జిక్యూషన్ స్టైలిష్‌గా ఉంది. సెట్స్, ఆర్ట్‌వర్క్, కలర్ ప్యాలెట్ – అన్నీ సినిమాకి పాలిష్డ్ లుక్ తెచ్చాయి. కొన్ని సన్నివేశాలు “సినిమాటిక్” లేదా “స్టేజ్‌డ్”లా అనిపించినా, ప్రెజెంటేషన్‌లో ప్రెషెనెస్ వలన ప్లో అలా వెళ్లిపోయింది.

తొమ్మిది ఇతి హాసాల కోర్ న్యారేటివ్, దానికి ప్యారలల్ గా నడిచే ట్రాక్. మనోజ్ మంచు ఎంట్రీలు స్లిక్ యాక్షన్ బ్లాక్ లతో స్టాండ్ అవుట్ అయ్యాయి. మనోజ్ విలనిజం, స్క్రీన్ ప్లెజన్స్ సాలిడ్ గా ఉంది. తేజా సజ్జా తన లైకబుల్ ఎనర్జీతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాడు. శ్రీయ సరణ్ రిఫ్రెష్ గా కనిపిస్తుంది, హీరోయిన్ పాత్ర ఓవర్ ఛీజీ కాకుండా బ్యాలన్స్ డ్ గా ఉండటం వల్ల కథలో దృష్టి మరలలేదు.

ఇంటర్వెల్ బ్లాక్ – స్పెషల్ హైలైట్

తేజా – పక్షి ఫైటింగ్ సీక్వెన్స్ చాలా బాగుంది. విజువల్ ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేసారు. ఈ సీక్వెన్స్ మిరాయ్ కి ఒక “బిగ్ స్క్రీన్ గుడ్ విల్” క్రియేట్ చేసింది.

సెకండాఫ్ లో: విజువల్ పవర్ + కలిసి రాని ఎమోషనల్ డెప్త్

ఎన్ని కొత్త ఎలిమెంట్స్ తీసుకున్నా కథ మొత్తంగా ప్రెండక్టబులిటీ నుంచి తప్పించుకోలేకపోయింది. చాలా మలుపులు ఊహించదగ్గవే. కానీ నేరేషన్ ప్లో, స్టైలిష్ ఎగ్జిక్యుషన్ , స్ట్రాంగ్ కాస్టింగ్ – ఇవి లోపాన్ని కప్పివేశాయి.

ఎవరెలా చేసారు :

తేజా సజ్జా ‘వేద’ పాత్రలో రెండు యాంగిల్స్ ను చూపించాడు. మొదట్లో అల్లరి చేసే యువకుడిగా, తర్వాత తన లక్ష్యం గ్రహించిన యోధుడిగా – ఈ రెండు వేరియేషన్స్‌లో అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం చేసిన కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది.

మణోజ్ మంచు మహావీర్ లామా పాత్రలో:
విలన్‌గా ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బలంగా నిలిచాయి. అయితే పాత్రకు మరింత లోతు, శక్తి ఇచ్చుంటే ఇంకా ప్రభావం చూపేదనే అనిపిస్తుంది.

శ్రియ సరణ్:
హీరో తల్లిగా శ్రియ పాత్ర సినిమాకు ఒక ఎమోషనల్ బలం ఇచ్చింది. కథలో కీలకమైన స్థానం ఆమె పాత్రదే.

జగపతిబాబు, జయరామ్:
ఇద్దరి పాత్రలు చిన్నవైనా, కథలో ప్రాధాన్యత ఉంది. స్క్రీన్ టైమ్ తక్కువైనా ఇంపాక్ట్ ఉండేలా తీర్చిదిద్దబడ్డాయి.

పాజిటివ్ పాయింట్స్ :

అద్భుతంగా తెరకెక్కిన ఐదు కీలక బ్లాక్స్

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

కథా నేపథ్యం (స్టోరీ బ్యాక్‌డ్రాప్) కొత్తదనం

తేజా సజ్జా నటన

భారీ విజువల్ ఎఫెక్ట్స్

దర్శకత్వం స్టైలిష్‌గా, ఆకట్టుకునేలా ఉండటం

నెగటివ్ పాయింట్స్ :

మొదటి భాగంలో పేస్ సమస్యలు

అవసరం లేని కామెడీ ట్రాక్

AI (కృత్రిమ మేధస్సు)ను అతిగా వాడటం

మొత్తం మీద :

మిరాయ్ కేవలం విజువల్ గా కొన్ని ఎపిసోడ్స్ అద్బుతం అనిపించాయి. కాకపోతే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా బాగుండేది. కాకపోతే విజువల్ గా థియేటర్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది. ఓ లుక్కేయచ్చు, డబ్బులు గిట్టుబాటు అవుతాయి.

, , , , , , ,
You may also like
Latest Posts from