మలయాళ సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్స్ కి ఎప్పుడూ స్పెషల్ ఎట్రాక్షనే. నిజానికి దగ్గరగా, సహజత్వంతో తెరకెక్కించే ఈ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను వెంటనే దోచుకుంటాయి. అలాంటి నేపథ్యంలో స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘తుడరం’ థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

రెంజిత్ నిర్మించిన ఈ చిత్రం దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వంలో వచ్చి, ఏప్రిల్ 24న భారీగా విడుదలైంది. మోహన్‌లాల్ సరసన ‘శోభన’ నటించింది. సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు. మోహన్‌లాల్ క్రేజ్, మార్కెట్ పవర్ ఉన్నప్పటికీ, ఈ చిత్రానికి రూ.28 కోట్ల లిమిటెడ్ బడ్జెట్ కేటాయించి కథ మీద ఫోకస్ పెట్టారు.

ఫలితంగా ‘తుడరం’ కేరళలోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతర్జాతీయంగా 200 కోట్లకుపైగా ఆదాయం సొంతం చేసుకుని, మలయాళ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే ఈ స్థాయి వసూళ్లను అందుకున్న మూడో సినిమా అవతరించింది. ఈ విజయంతో మలయాళ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు లభించింది.

ఇప్పుడు ఈ సినిమా జూన్ లో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అందరూ ఇప్పుడు ఈ క్రమంలో చూసే అవకాశం పొందబోతున్నారు.

కథ ఏమిటి?

కథలో మోహన్‌లాల్ ఒక టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడు. అతని జీవితం సింపుల్, నిజాయితీకి నిదర్శనం. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని కొడుకు స్నేహితులతో కలిసి తండ్రి కారులో చెన్నైకి వెళ్తాడు. ఆ సమయంలో పోలీసులు ఆ కారును గంజాయి స్మగ్లింగ్ కింద సీజ్ చేస్తారు. ఈ సంఘటన వల్ల హీరో జీవితంలో విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ తర్వాతి కథ ఏ విధంగా ఉంటుందన్నదే ఆసక్తికర అంశం.

,
You may also like
Latest Posts from