నెగిటివ్ పీఆర్ తెలుగు పరిశ్రమలో ఈ మధ్యన బాగా ఎక్కువైన సంగతి తెలిసిందే. నిర్మాతలు, దర్శకులతో పాటు హీరోలు ఈ నెగిటివ్ పీఆర్ ట్రెండ్ కు బలి అవుతున్నారు. సినిమా రిలీజైన మరుక్షణమే ఈ నెగిటివ్ ట్రెండ్ స్టార్టైపోతోంది. ఈ విషయమై నాగ చైతన్య రీసెంట్ గా షాకింగ్ కామెంట్స్ చేసారు.చిత్ర పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీని ఉద్దేశించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు నటుడు నాగచైతన్య (Naga Chaitanya).
నాగచైతన్య మాట్లాడుతూ… ‘‘పీఆర్ గేమ్‌లోకి నేను చాలా ఆలస్యంగా వచ్చాను. సోషల్‌మీడియా కూడా అరుదుగా వాడుతుంటా. సినిమా కోసం వర్క్ చేశామా.. ఇంటికి వెళ్లామా.. మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్లు ఉంటా. అంతేకానీ నాకు ఈ రాజకీయాలు తెలియవు.
నువ్వు ఉన్న రంగంలో రాణించడం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు తప్పదు. గత రెండేళ్లలో పీఆర్ అనేది ఎక్కువైంది. ప్రతినెలా సుమారు రూ.మూడు లక్షలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్లు కాదు.
ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే తప్పకుండా పీఆర్ కోసం ఖర్చు పెట్టాలి. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పు లేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారు. పక్కనోడిని తొక్కేయడానికి చూస్తారు.
అది నాకు ఏమాత్రం అర్థం కాదు. అలా చేయడం కూడా తప్పు. పక్కనోళ్లను ఇబ్బందిపెట్టే బదులు.. ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం.. ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన విహారయాత్రలకు వెళ్లడం చేయొచ్చు కదా’’ అని నాగచైతన్య చెప్పారు.
ఇదే ఇంటర్వ్యూలో ఆయన తన మాజీ భార్య సమంతతో విడిపోవడం గురించి కూడా మాట్లాడారు.
‘‘విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే మేమిద్దరం విడిపోవాలనుకున్నాం.
మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్ వార్తలు వచ్చాయి. నా మీద నెగెటివ్ కామెంట్లు చేసేవారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి అని అన్నారు.