నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కుబేర. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగ్, ధనుష్, రష్మిక పోస్టర్స్ తో పాటు ముగ్గురు పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

శేఖర్ కమ్ముల కూడా క్లాసిక్, లవ్ స్టోరీలు కాకుండా ఈసారి కొత్తగా ఢిఫెరెంట్ గా ట్రై చేస్తుండటంతో ఈ సినిమాపై అంచానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని తెలుస్తుంది. తాజాగా కుబేర సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. కుబేర సినిమా 20 జూన్ 2025న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

కుబేర సినిమాని పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. డబ్బు, ఓ ధనవంతుడు, ఓ బిచ్చగాడు చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. అయితే కుబేర చిత్రానికి రిలీజ్ డేట్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

ధనుష్ మరో చిత్రం ఇడ్లీ కడై ఏప్రియల్ 10 రిలీజ్ డేట్ ఇచ్చారు. అయితే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే రోజు రిలీజ్ డేట్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఇడ్లీ కడై విడుదల తేదీ మారేలా ఉంది. అప్పుడు ఫోస్ట్ ఫోన్ అయ్యి మిడ్ మే కి వెళ్లేలా ఉంది. అప్పుడు కుబేరకు ఇడ్లీ కడైకు మధ్య గ్యాప్ రెండు వారాలే ఉంటుంది. దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరు. డేట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.

,
You may also like
Latest Posts from