
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అనగనగా ఒక రాజు’ చివరికి రిలీజ్ డేట్ ఖరారైంది. ఎన్నో అప్‌అండ్‌డౌన్స్ ఎదుర్కొన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నది.
ఇంట్రెస్టింగ్‌గా… రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ని మూవీ టీమ్ యూనిక్‌గా చేసింది. హీరో-హీరోయిన్‌లు జ్యువెలరీ యాడ్‌లో కనిపిస్తూ ‘సంక్రాంతి ప్రోమో’ పేరిట వీడియోను విడుదల చేశారు. ఆ క్రియేటివ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎన్నో లేట్స్, డైరెక్టర్ మార్పు… కానీ క్రేజ్ తగ్గలేదు!
2021లోనే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా అనుకోని కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. మధ్యలో డైరెక్టర్ కూడా మారిపోయాడు. అయినా, ‘జాతిరత్నాలు’ హీరో క్రేజ్ వలన మూవీపై ఇంట్రెస్ట్ మాత్రం తగ్గలేదు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
సంక్రాంతి రేసులో ‘అనగనగా ఒక రాజు’
సంక్రాంతి బరిలో ఈసారి పోటీ కఠినంగా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కూడా అదే సీజన్‌లో రానుంది. బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ జరుగుతున్నా… చిన్న సినిమాలకే సింపతీ వర్కౌట్ అవుతుందనే మాట వినిపిస్తోంది. మరి ఈసారి నవీన్ పోలిశెట్టి రాజుగా వచ్చి ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.
టెక్నికల్ టీమ్
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్. నాగవంశీ ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సినిమాటోగ్రఫీకి యువరాజ్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది విడుదలైన ‘ప్రీ వెడ్డింగ్ వీడియో’ టీజర్ సూపర్ హిట్ కాగా… ఇప్పుడు రిలీజ్ డేట్ వీడియో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
