హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆరు వారాల్లో పూర్తి నివేదికను సమర్పించాలని, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు NHRC నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో ఇప్పటికే జనవరిలో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేసిన నేపథ్యంతో, కమిషన్ మొదట చిక్కడపల్లి ఏసీపీ మరియు సంబంధిత జోన్ డీసీపీకి నోటీసులు పంపింది. అయితే, వారు సమర్పించిన ప్రాథమిక నివేదికలో స్పష్టత లేకపోవడంతో పాటు బాధ్యతాపూర్వకత లోపించిందని NHRC తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే తాజాగా, మరింత ఖచ్చితమైన నివేదిక కోరుతూ సిటీ సీపీకి నేరుగా నోటీసులు పంపినది.
పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో రేవతి (36) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు.