ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోవడంతో ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోయిందని, నీల్ మరో సినిమా మొదలుపెడుతున్నారన్న టాక్ కూడా బాగానే వైరల్ అయింది.

కానీ.. ఇవన్నీ పనికిరాని రూమర్స్!

తాజా సమాచారం ఏమంటుందంటే:

‘డ్రాగన్’ షూట్ మళ్లీ స్టార్ట్ అవుతోంది. నవంబర్ మూడో వారం నుంచి తిరిగి కెమెరా ఆన్ కానుంది. నార్త్ యూరప్‌లో కీలక యాక్షన్ సన్నివేశాలు, అదనంగా యూరప్‌లోని మరికొన్ని దేశాల్లో కూడా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే, మొదట చెప్పినట్లు జూన్ 2026 రిలీజ్ అవకాశం ప్రస్తుతం కనిపిస్తోంది. కానీ టీమ్ మాత్రం ప్లానింగ్ టైట్ చేసుకుని, ఫుల్ ఎనర్జీతో తిరిగి పనిలో పడుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్ ప్రస్తుతం డార్క్, మ్యాచ్యూర్ లుక్‌తో — మందమైన గడ్డం, మీషీలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్.

మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి…

, , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com