హాలీవుడ్‌లో అతి పెద్ద వేడుక ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా పూర్తైంది . 97వ ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్స్ లో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సారి ఊహించని సినిమాలకు, ఆర్టిస్టు లకు అవార్డులు వరించాయి. ఈ సారి కంటెంట్‌కి పెద్ద పీఠం వేసినట్టు తెలుస్తుంది.
ఇందులో భాగంగా బెస్ట్ ఫిల్మ్ క్యాటగిరి లో అనేక చిత్రాలు పోటీపడగా ‘అనోరా’ సినిమాను ఆస్కార్ 2025 ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ముద్దాడింది. కాగా 97వ అకాడమీ అవార్డ్స్‌లో ‘అనోరా’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకోవడం మాత్రమే కాదు, ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ దర్శకత్వ విభాగం ఆస్కర్ గెలుచుకోవడంతో పాటుగా, ఈ చిత్రం మొత్తం ఐదు విభాగాల్లో గెలుపొందింది. ఈ ఏడాది 5 ఆస్కార్లు గెలుచుకున్న సినిమాగా ‘అనోరా’ చరిత్ర సృష్టించింది.
గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘డ్యూన్: పార్ట్2’ ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్ సొంత చేసుకున్న ‘అనూజ’ చిత్రానికి నిరాశ ఎదురైంది. ఆ కేటగిరిలో ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది.
ఇంకా ఎవరెవరు, ఏ ఏ సినిమాలు అవార్డులు వచ్చాయో చూద్దాం.
2025 ఆస్కార్ విజేతలు :
ఆస్కార్ విజేతలు వీళ్లే..
ఉత్తమ చిత్రం – అనోరా
ఉత్తమ నటుడు – అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి – మైకీ మ్యాడిసన్ (అనోరా)
ఉత్తమ దర్శకత్వం – అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ – ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్ – అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
ఉత్తమ సౌండ్ – డ్యూన్: పార్ట్2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – డ్యూన్:పార్ట్2
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్- బ్రెజిల్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – వికెడ్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఐయామ్ నాట్ ఏ రోబో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగిన 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
