వైవిధ్యమైన టైటిల్స్ పెట్టకపోతే ఎవరూ ఏ సినిమాని పట్టించుకోవటం లేదు. అందుకే ప్రతీ సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ని వెతుకుతున్నారు దర్శక,నిర్మాతలు. అదే విధంగా ఇప్పుడు ప్రభాస్ సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘బకా’ (BAKA) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ని అనుకోవటానికి గల కారణం ఏమిటి, డైరక్టర్ ఎవరు.
ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు ‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma). మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందునున్న ఈ మూవీని మహాభారతంలోని బకాసురుడి కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నారని టాక్ నడుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి కథకు తగ్గట్టుగానే బకాసురుడు మూవీ కాబట్టి ‘బకా’ అనే ఈ టైటిల్ షార్ట్ గా, సినిమాకు రిలేటెడ్ గా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాలో భాగంగా ఉండబోతుందని, ఇప్పటివరకు రిలీజ్ అయిన మైథలాజికల్ సినిమాలు అన్నింటి కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు.
ఇక రన్వీర్ సింగ్ తో ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, ఈ మూవీకి ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్టు లోకి అడుగు పెట్టాక ఈ మూవీకి ‘బకా’ అనే టైటిల్ ని మార్చారనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.