జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి ఫోటో, మీమ్, వీడియో వెనుక అసలు ఎవరి అనుమతీ లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన పేరు , ఫేస్, వీడియోలు ఎలా వాడుతున్నారో చూస్తూ… ఎన్టీఆర్ చివరికి కోర్టు ద్వారం తట్టారు.
ఎందుకు కోర్టు? ఏమైంది?
జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదన ఒక్కటే: ఇకామర్స్ సైట్‌లు, సోషల్ మీడియా… ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిస్తున్నాయి.
ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు, పేరు –అనుమతి లేకుండా వాడుతున్నారు. వాటిని కమర్షియల్‌గా ఉపయోగిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.
ఇది పర్సనాలిటీ & పబ్లిసిటీ రైట్స్ లాంగించడం అని స్పష్టంగా తెలిపారు.
కోర్ట్ స్పందన ఎలా?
పిటిషన్ విచారించిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా వెంటనే కీలక ఆదేశాలు జారీ చేశారు:
ఐటీ నిబంధనలు 2021 కింద — ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లు, సోషల్ మీడియా కంపెనీలు, ఎన్టీఆర్ పిటిషన్‌ను అధికారిక ఫిర్యాదుగా పరిగణించాలి.
మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలి.
తదుపరి విచారణ తేదీ: డిసెంబర్ 22.
అంటే… సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు ఇప్పుడు ఎన్టీఆర్ విషయంపై అధికారికంగా స్పందించాల్సిందే.
ఇదే మొదటిసారి కాదు… ఇండస్ట్రీలో పెద్ద మూవ్!
ఇది ఒక్క ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, అమితాబ్ , అజయ్ దేవ్‌గణ్, ఐశ్వర్యరాయ్ వంటి స్టార్‌లు కూడా ఇదే రక్షణ కోరారు.
ఫోటోలు, వీడియోలు, పేర్లు – అనుమతి లేకుండా వాడొద్దు అని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే ఆలోచనతో — ఎవరు అయినా, ఎక్కడైనా… నా వ్యక్తిగత హక్కులు, నా పేరు, నా ఫోటోలను వాణిజ్యంగా వాడొద్దు. సోషల్ మీడియా కాలంలో ట్రోలింగ్, ఫేక్ పోస్టులు, డీప్‌ఫేక్ వీడియోలు పెరిగిపోయాయి. ఇక న్యాయపరమైన రక్షణ తప్ప వేరే మార్గమే లేదు.
ఇంతకీ ఎన్టీఆర్ మీద ఇప్పటివరకు వచ్చిన పోస్టులు, వీడియోలు… ఏవి తొలగిస్తారు? ఎవరికీ నోటీసులు వస్తాయి? స్టోరీ ఇంకా కొనసాగుతుంది!

