సివిల్ వివాదాల్లో పోలీసులు మితిమీరిన జోక్యం చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రముఖ టీవీ నటి శిల్పా చక్రవర్తి భర్త జడ కల్యాణ్ యాకయ్యతో కలిసి నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామంలోని 32 ఎకరాల భూమిపై ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ టి. వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం — “ఇంజంక్షన్ ఉత్తర్వులు ఉన్నా, సివిల్ కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసులు ఎందుకు జోక్యం చేశారు?” అంటూ చింతపల్లి ఎస్సై రామ్మూర్తికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది.

అసలు విషయం ఏమిటి?

2017లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నుంచి శిల్పా దంపతులు భూమిని కొనుగోలు చేసినట్టు సమాచారం. అప్పటి నుంచి సివిల్ కేసు నడుస్తోంది. పిటిషనర్లు కోర్టులో ఇంజంక్షన్‌ ఉత్తర్వులుతో పాటు పోలీసుల రక్షణ కూడా పొందారు. అయినప్పటికీ, స్థానిక ఎస్సై, భూమిని అమ్మిన వ్యక్తితో చేతులు కలిపి, “వివాదాన్ని సెటిల్ చేయండి” అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు.

హైకోర్టు జోక్యం

ఈ ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం పోలీసు శాఖకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలీసుల తీరుపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.

న్యాయవ్యవస్థపై భరోసా ఉంచిన శిల్పా దంపతుల పిటిషన్, పోలీసుల నిర్వాహక దోరణిపై హైకోర్టు ప్రశ్నలు — ఈ కేసు మరిన్ని రాజకీయ, న్యాయ పరిమాణాలు అందుకోనుందన్నదే విశ్లేషకుల అభిప్రాయం.

,
You may also like
Latest Posts from