లైలా వివాదం జరుగుతున్నప్పటికీ కూడా పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పకపోగా మరోసారి వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఫ్యాన్స్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పృధ్విరాజ్ కి వివాదం కారణంగా అధిక రక్తపోటుకు గురై హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రి బెడ్ మీది నుంచే మీడియాతో మాట్లాడిన పృధ్వీ.. మరోసారి బూతులతో రెచ్చిపోయారు. వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసారు. 11 అనే మాట వస్తేనే వైసీపీ వాళ్ళు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. నా తల్లిని కూడా బూతులతో తిడుతున్నారంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు పృధ్వీ సారీ చెప్పే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దమ్ముంటే ట్రోలర్స్ ముందుకు రావాలని సవాల్ విసిరారు.
నటుడు పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ శ్రేణులపై అభ్యంతరకర పదజాలంతో వివాదానికి తావిచ్చిన నటుడు పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి మండిపడ్డారు.
‘టాలీవుడ్ బాగుపడాలని సానుకూలంగా చెబుతున్నాం. కామ కుక్క పృథ్వీకి ఏ సినిమాలో ఛాన్స్ ఇచ్చినా.. ఏ సినిమా ఫంక్షన్‌కు అతడిని పిలిచినా.. ఆ సినిమాలను బాయ్‌కాట్ చేస్తాం.’ అని వెంకట రెడ్డి హెచ్చరించారు.
వైసీపీ వాళ్ళు గొర్రెలు అయితే..క్షమాపణలు చెబుతామని పేర్కొన్నారు పృథ్వీరాజ్ భార్య. తన భర్త ఆస్పత్రిలో పడటంపై పృథ్వీరాజ్ భార్య స్పందించారు. ట్రోలర్స్ కు పృథ్వీరాజ్ భార్య సవాల్.. విసిరారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడండి అంటూ సవాల్ చేశారు. నా భర్త గొర్రెల గురించి మాట్లాడారే తప్ప రాజకీయంగా మాట్లాడలేదన్నారు.