మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసమందే. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఓ ప్రత్యేకమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుందని ప్రచారం జరుగుతోంది. బుచ్చిబాబు తన తొలి చిత్రం ఉప్పెనతో సాలీడ్ విజయాన్ని అందుకున్నారు. ఇక రెండో ప్రయత్నంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం, ఈ ప్రాజెక్ట్‌కు ఎక్కడ లేని క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేసారని ,త్వరలోనే ప్రకటించబోతున్నారని వినికిడి.
ముందుగా ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది.
క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ కావడంతో, ఈ టైటిల్‌కు మంచి కనెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో కుస్తీ కూడా ప్రధానమైన ఎలిమెంట్‌గా ఉండనుందని సమాచారం.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేసే అవకాశముందని టాక్.