ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా మాస్ ఎంటర్‌టైనర్ “ఆంధ్ర కింగ్ తాలూకా”. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న.. ఈ మాస్ యాక్షన్ డ్రామా నవంబర్ 28, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ అప్ డేట్స్ మొదలయ్యాయి.
ఈ క్రమంలో రామ్ పోతినేనీ ఈసారి అమెరికాలోనే హంగామా చేయబోతున్నాడు. ఓవర్సీస్ మార్కెట్‌ని గెలుచుకున్న రామ్, కొన్ని మాస్ సినిమాల తర్వాత US కనెక్ట్ తగ్గినా… ‘అంధ్ర కింగ్ తలూకా’ తో మళ్లీ ఓవర్సీస్ రికార్డులకు హై టార్గెట్ పెట్టాడు!
USAలో ఎర్లీ ప్రీమియర్స్ – ప్రపంచం కంటే ముందే!
ఈ సినిమా నవంబర్ 26న అమెరికాలో ప్రత్యేక ప్రీమియర్ షోలు పెట్టేశారు. మరి ముఖ్యంగా—రామ్ స్వయంగా US కి వచ్చి ప్రీమియర్స్‌కి హాజరవుతున్నాడు!
ఓవర్సీస్ టీమ్ మాటలో:
“ఈసారి USA కూడా రామ్ ఎనర్జీని ఫీల్ చేయబోతోంది! #AndhraKingTaluka early premieres on Nov 26!”
ఇక ఇప్పటికే చివరి షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగా.. తాజా సమాచారం ప్రకారం మొత్తం షూటింగ్‌ను ముగించినట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామ్ కొత్త లుక్, కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నాడని టాక్. సినిమా పూర్తి మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలబోతగా ఉండబోతోందట.
ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్‌లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే సౌత్ స్టార్ ఉపేంద్ర కూడా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఆయన పాత్ర సినిమా హైలైట్‌గా నిలుస్తుందనే ప్రచారం ఉంది. సంగీతంకు వస్తే, వివేక్ మెర్విన్ ద్వయం ఈ చిత్రానికి ట్యూన్స్ అందిస్తున్నారు.

