రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు, రామ్ చరణ్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిట్టిబాబుగా ఇరగదీశాడు చరణ్.
ఈ సినిమా 1980వ దశకంలో ఒక ఊరిలో జరిగే కథను ఆధారంగా తెరకెక్కించారు సుకుమార్. రామ్ చరణ్ ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తాడు. చరణ్ వినికిడి సమస్య ఉన్న పాత్రలో అద్భుతంగా నటించాడు. చరణ్ అన్నగా కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి, ఊరి పెద్దలైన ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించారు. అలాగే స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రమాలక్ష్మి పాత్రలో చిట్టిబాబు ప్రేమికురాలిగా నటించింది. అదేవిధంగా రంగస్థలం సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోసింది.
సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్‌లోనే బెస్ట్ అని అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం.
అయితే, ఇప్పుడు ఈ సినిమా మరోసారి సౌండ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ, ఈ చిత్రం ఈసారి సౌండ్ చేసేది థియేటర్లలో కాదు.. బుల్లితెరపై. రామ్ చరణ్ సినిమాలకు ఉత్తరాదిన మాంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది.. రంగస్థలం చిత్రం కోసం అక్కడి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా హిందీ భాషలో బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా తీసుకొస్తున్నారు.
గోల్డ్‌మైన్స్ టీవీ ఛానల్‌లో రంగస్థలం చిత్రాన్ని ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాకు సాలిడ్ టీఆర్పీ రేటింగ్స్ రావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించగా రాక్‌స్టార దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.