

మార్ఫ్ చేసిన ఫొటోలు, AIతో క్రియేట్ చేసిన అసభ్యకర వీడియోలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో ఎంత వేగంగా వైరల్ అవుతున్నాయో, అంతే వేగంగా నటీనటుల ప్రతిష్టకు దెబ్బ తగులుతోంది. ఈ తలనొప్పులతో చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు మాత్రమే లీగల్ గా చర్యలు తీసుకుంటున్నారు.తాజాగా ఇదే విషయమై ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టు ద్వారం తట్టారు.
ఐశ్వర్య రాయ్ పిటీషన్:
తన పేరు, ఫొటోలు, AI చిత్రాలను అనుమతి లేకుండా వాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
యూట్యూబ్‌లో అసభ్యకర వీడియోలు
సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలు వైరల్
టీ షర్టులపై ప్రింట్ చేసి అమ్మకాలు
ఈ షాకింగ్ విషయాలను ఆమె తరఫు న్యాయవాది సందిప్ సెథి కోర్టులో వెల్లడించారు.
కోర్టు స్పందన:
తాత్కాలికంగా ఆమె పేరు, ఫొటోలు ఎవరు వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిపై పూర్తి విచారణ జనవరి 15, 2026న జరుగనుంది.
ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య ఆరోగ్యంపై వచ్చిన “తీవ్ర అనారోగ్యం… ఇక లేరు” అనే తప్పుడు వార్తలపై కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో కూడా హైకోర్టు గట్టిగా స్పందించి యూట్యూబ్ ఛానళ్లకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పుడు ఈ కొత్త పిటీషన్‌తో AI ఫేక్ కంటెంట్ క్రియేటర్స్‌కు పెద్ద షాక్ తగలబోతోందని టాక్.