సినిమా వార్తలు

స్టేజిపై ‘కాంతార’పై నోరు జారిన రణ్ వీర్, క్షమాపణకి డిమాండ్‌

పాన్‌–ఇండియా రేంజ్‌లో కాంతార అంట్రీస్ బ్రేక్ చేసి, రూట్‌ మార్చి, ఇండియన్ సినిమా మార్కెట్‌కి కొత్త ‘కల్ట్ క్లాస్’ను ఇచ్చింది. చిన్న బడ్జెట్… భారీ కలెక్షన్స్… పంజుర్లీ దేవత సన్నివేశాలు భారత సినీ చరిత్రలో నిలిచిపోయేంత ఇంపాక్ట్. ఇటువంటి సినిమా గురించి మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద ఒక్క మాట… ఒక్క ఎక్స్‌ప్రెషన్ కూడా ఎంత భారం మోస్తుందో రణ్‌వీర్ సింగ్ తాజాగా గ్రహించాడు.

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) స్టేజ్‌పై రణ్‌వీర్‌ సింగ్ కాంతార గురించి మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదం అయింది. అసలు ఏం జరిగిందంటే…

కథనంలోకి… రణ్‌వీర్ ఒక మాటతో సరగ్గొట్టాడా?

రణ్‌వీర్‌ మొదట రిషబ్‌ శెట్టిని ఆయన శక్తివంతమైన నటనను ప్రశంసించాడు. కానీ తరువాతే అసలు వివాదం మొదలైంది. నోరుజారి..

“హీరోలోకి దెయ్యం వచ్చేసినప్పుడు సన్నివేశాలు సూపర్‌గా ఉన్నాయి” అని చెప్పడంతో పాటు,
స్టేజ్ మీదే కాంతారాలో హైలైట్ అయిన “ఓ…” శబ్దాన్ని కామెడీ స్టైల్లో ఇమిటేట్ చేశాడు.

అదీ గాగుల్స్ తీసి కళ్లు పైకి తిప్పుతూ..

“మా దేవతను కామెడీ చేశావా?” — కన్నడ పబ్లిక్ ఫైర్

కాంతారా కోసం కన్నడిగుల ప్రేమా, భక్తి ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. పంజుర్లీ దేవతపై ఉన్న ఆధ్యాత్మిక కనెక్షన్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు.

దాంతో రణ్‌వీర్ చేసిన ఆ ఇమిటేషన్‌ను చాలా మంది “సినిమాను కాదు… మా దేవతను అవమానించావు”
అని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్‌లు వరదలా:
“క్షమాపణ చెప్పాలి!”
“ఇది కామెడీ కాదు, అవమానం!”
“ఇది IFFI స్టేజ్… జాగ్రత్తగా మాట్లాడాలి!”

అంటూ రణ్‌వీర్‌ను ట్యాగ్ చేస్తూ దుమారం రేపుతున్నారు.

స్టేజీ మీద మాట అంటే… మైక్ ఆన్ ఉన్న ప్రతి మాట ‘హెడ్‌లైన్’ అవుతుంది!

ఇండియాలో కల్చర్, రిజియన్, భక్తి—ప్రతి టాపిక్‌కి సెన్సిటివిటీ మాక్సిమమ్. అదీ కాంతారా లాంటి ఆధ్యాత్మిక–కల్చరల్ కల్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే, జోక్ కు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.

స్టేజ్ మీద

“ఒక ఫన్… ఒక ఎక్స్‌ప్రెషన్… ఒక్క శబ్దం” ఏం చేసినా దాని అర్ధం వెయ్యి దారుల్లో పరిగెడుతుంది. ఇదే ఇప్పుడు రణ్‌వీర్ మెడకు చిక్కింది.

కాంతారా ఇంపాక్ట్‌ నే మర్చిపోలేము!

చిన్న బడ్జెట్‌తో దేశం మొత్తం షేక్ చేసిన సినిమా. బాక్సాఫీస్‌లో నాన్–స్టాప్ కలెక్షన్ రన్. పంజుర్లీ దేవత సన్నివేశాల వల్ల క్రేజ్ గరిష్ట స్థాయికి. రిషబ్‌ శెట్టి పెర్ఫార్మెన్స్‌కు జాతీయ అవార్డు.

ఇంత నేపధ్యం ఉన్న సినిమా గురించి మాట్లాడే ముందు హండ్రెడ్ టైమ్స్ ఆలోచించాల్సిందే.

ఫైనల్ గా రణ్‌వీర్‌ సినిమాని అప్రిషియేట్ చేయాలని అన్నా, స్టైల్ కామెడీ వైపుకు మళ్లడంతో రివర్స్ అయ్యింది. ఇప్పుడు “క్షమాపణ చెప్పాలి!”
అనే డిమాండ్ సోషల్ మీడియాలో మరింత పెరుగుతోంది.

Similar Posts