
రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?!
రష్మిక మందన్న చేసిన ఎమోషనల్ డ్రామా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద స్లోగా కానీ స్ట్రాంగ్‌గా పికప్ అవుతోంది! రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజు కంటే గణనీయంగా పెరగడం, ఆదివారం కూడా బాగానే రన్ ఉండటంతో, ట్రేడ్ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా హవా స్పష్టంగా కనిపిస్తోంది. ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో వస్తున్న పాజిటివ్ పోస్టులకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరోయిన్ రష్మిక ఇద్దరూ వ్యక్తిగతంగా రిప్లై ఇస్తున్నారు — ఇది సినిమాలో మరో లైఫ్ ఇస్తోంది.
అర్బన్ ఏరియాస్‌లో ఇప్పటికే సినిమా బలంగా నడుస్తుండగా, మల్టీప్లెక్స్‌ల్లో అదనపు షోలు కూడా ఏర్పాటు చేశారు. అయితే, బి & సి సెంటర్స్‌లో ఇంకా పూర్తి బూస్ట్ రావాల్సి ఉంది.
ప్రేక్షకులు రష్మిక నటనకు ఫిదా అవుతుండగా, ఆమె సోషల్ మీడియాలో అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’కి గుడ్ రెస్పాన్స్ – కానీ ‘జటాధర’ పూర్తిగా అవుట్!
తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ కి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న “ప్రీ వెడ్డింగ్ షూట్స్” మీద సెటైరికల్ టేక్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే, సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ మాత్రం టోటల్ వాషౌట్ — ట్రేడ్ వర్గాల మాటల్లో చెప్పాలంటే, అతని కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాప్ అని టాక్!
