సినిమా వార్తలు

‘ది గర్ల్‌ఫ్రెండ్’ కలెక్షన్స్ ఇప్పుడు ట్రేడ్ లో పెద్ద షాక్!

తెలుగులో ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా తమ రేంజ్ నెంబర్‌లు అందుకోవడానికి కష్టపడుతున్నా… రష్మిక మందన్నా లీడ్‌లో వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మాత్రం నార్త్ అమెరికాలో ఊహించని స్థాయిలో పరిగెడుతోంది. డొమెస్టిక్ మార్కెట్‌లో సైలెంట్‌గా ఉన్న ఈ సినిమా, ఓవర్సీస్‌లో మాత్రం మౌత్ టాక్‌తో మూడో వీకెండ్‌కూడా నెంబర్‌లు పెంచుకుంటూ పోతుంది. ఈ సినిమా అక్కడ ఎందుకు ఇలా వర్కౌట్ అవుతోంది? అనే ప్రశ్న ఇప్పుడు ట్రేడ్‌లో హాట్ టాపిక్.

రిలీజ్ అయిన 7 నవంబర్ (ఇండియా) – 6 నవంబర్ (నార్త్ అమెరికా) నుండి, సినిమా అక్కడ దూసుకెళ్తూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం, మూడో వీకెండ్‌కే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ $700k మార్క్‌ను దాటి మరో మైలురాయిని చేరుకుంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌కు సినిమా $350k వద్దే బ్రేక్ ఈవెన్ అయ్యిన విషయం తెలిసిందే. అంటే అక్కడి నుండి వచ్చే ప్రతి డాలర్ ఇప్పుడంతా ప్యూర్ ప్రాఫిట్.

సాధారణంగా ఈ రేంజ్‌లోని తెలుగు సినిమాలు ఓవర్సీస్‌లో $1 మిలియన్ దాటితేనే ‘సూపర్ హిట్’ ట్యాగ్ దక్కుతుంది. కానీ కొనుగోలు ధర – రికవరీ – లాభాలు అన్నీ కలిపి చూస్తే, $700k వద్దే ఇది డిస్ట్రిబ్యూటర్‌కు పెద్ద విజయం. ట్రేడ్ సర్కిల్స్ కూడా ఇదే విషయాన్ని గుర్తించి సినిమాకు పాజిటివ్ గ్రేడ్ ఇస్తున్నాయి.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి లీడ్స్‌లో టాక్సిక్ రిలేషన్‌షిప్స్, మహిళల స్వీయ గౌరవం వంటి థీమ్‌లను చూపిస్తుంది. ఇండియాలో సినిమా సగటు రేంజ్‌లో నిలిచినా, నార్త్ అమెరికాలో మాత్రం ఇది క్లియర్ హిట్.

ఇప్పుడంతా ఒకే ప్రశ్న: ఇది $1 మిలియన్ దాకా వెళ్లుతుందా?

ప్రస్తుతం ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి ఉన్న మోమెంటమ్‌ని చూస్తే… ‘ది గర్ల్‌ఫ్రెండ్’ $1 మిలియన్ క్లబ్‌ను చేరే అవకాశాలు ఉన్నాయా?’ అనేదే అందరి ఆసక్తి.
వచ్చే వీకెండ్ నెంబర్‌లు ఈ సినిమా జర్నీని ఇంకెంత దూరం తీసుకెళ్తాయో చూడాలి!

Similar Posts